Kamala Harris : మార్టిన్ లూథర్ కింగ్ వాగ్ధానాలే మా ప్రథమ ప్రాధాన్యాలన్న కమలా హారిస్
Kamala Harris : మార్టిన్ లూథర్ కింగ్ ఒక ముఖ్యమైన పౌర హక్కుల కార్యకర్త. అమెరికాలో జాతివివక్షను అంతమొందించే ఉద్యమంలో ఆయన నాయకుడిగా ఉన్నారు. ఆయన చేసిన ప్రసంగం ‘ఐ హావ్ ఎ డ్రీమ్’ ప్రసంగం. అహింసాయుత నిరసనను సమర్థించంది. నోబెల్ శాంతి బహుమతి పొందిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. 1968లో ఆయన హత్యకు గురయ్యారు.
1968లో, మార్టిన్ లూథర్ కింగ్ మరణించిన కొద్దికాలానికే, అతని జయంతిని గౌరవార్థం సెలవుదినంగా మార్చాలని ప్రచారం ప్రారంభించారు. మొదటి బిల్లు ప్రవేశపెట్టిన తరువాత, కార్మిక సంఘాలు ఫెడరల్ హాలిడే కోసం ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నాయి. దీనికి 1976లో ఆమోదం లభించింది. సంగీతకారుడు స్టీవీ వండర్ తన సింగిల్ ‘హ్యాపీ బర్త్ డే’ మరియు ఆరు మిలియన్ల సంతకాలతో ఒక పిటిషన్ తో మద్దతు ఇచ్చిన తరువాత, ఈ బిల్లు 1983లో చట్టంగా మారింది. మార్టిన్ లూథర్ కింగ్ డేను మొదటిసారిగా 1986 లో జరుపుకున్నారు, అయినప్పటికీ ఇది 2000 సంవత్సరం వరకు అన్ని రాష్ట్రాల్లో పాటించబడలేదు. 1990 లో, వ్యోమింగ్ శాసనసభ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ /వ్యోమింగ్ సమానత్వ దినోత్సవాన్ని చట్టపరమైన సెలవుదినంగా గుర్తించింది.
ఆయన వాగ్ధానాలను పాటిస్తాం: కమలా హారిస్
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ జాతి వివక్షతను రూపు మాపేందుకు ఎంతో శ్రమించారు. ఆయన వాగ్ధానాలకు బైడెన్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అన్నారు. జనవరి 3వ సోమవారం (జనవరి 15) రోజున ఆమె ప్రజలతో మాట్లాడారు. మార్టిన్ సేవలు ఎనలేనివన్నారు. ఆయన వాగ్ధానాలను నెరవేర్చేందుకు బైడెన్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
As Dr. King wrote in his Letter from Birmingham Jail: “The goal of America is freedom.”
Though we have come far, it is up to all of us to continue the fight. pic.twitter.com/1Wdjo58cwN
— Vice President Kamala Harris (@VP) January 16, 2024