HanuMan : హను-మాన్ కు అదే ప్లస్ అయ్యిందా?
HanuMan : హను-మాన్ .. సంక్రాంతి బరిలోకి వచ్చిన చిన్న సినిమా. పేరుకు చిన్న సినిమా అయినా కంటెంట్ మాత్రం పాన్ ఇండియన్ లెవల్. ఏకంగా ముగ్గురు పెద్ద హీరోల సినిమాలకు పోటీగా వచ్చింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ మూవీకి పోటీగా 12న రిలీజైంది. ఏదో దొరికినా థియేటర్ల హనుమాన్ ను వేశారు. కానీ అనూహ్యంగా ‘గుంటూరు కారం’ రోటిన్ సినిమా కావడం.. నాలుగైదు సినిమాలను చాపచుట్టేసినట్టు ఉండడంతో మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. రెండో ఆట నుంచే నెగటివ్ టాక్ ప్రభావం పడింది.
ఇక హనుమాన్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో..గుంటూరు కారం ఆడియన్స్ అంతా హనుమాన్ కు షిఫ్ట్ అయిపోయారు. ప్రస్తుతానికి ఉన్న థియేటర్లలో అద్భుత కలెక్షన్లు రాబట్టుతోంది. ఇక సైంధవ్ కూడా మిక్స్ డ్ టాక్ రావడంతో హనుమాన్ కలెక్షన్లు భారీగా పెరిగిపోయాయి.
ఇక నార్త్ లో కూడా హనుమాన్ దుమ్మురేపుతోంది. ఈ టైంలో అక్కడ పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో.. హనుమాన్ కు మౌత్ టాక్ తో ఆడియన్స్ పెరిగిపోతున్నారు. ఇక అన్నింటికంటే ప్రధానమైంది.. 22న అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం, రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉండడంతో.. ఇప్పటికే జై శ్రీరామ్, జైహనుమాన్ ..అంటూ మెజార్టీ హిందువులంతా అదే మూడ్ లో ఉండడం కూడా హనుమాన్ మూవీకి బాగా కలిసొస్తుంది. ఈ మూవీ ప్రధానాంశమే హనుమాన్ కావడం.. హనుమాన్ ఎలివేషన్స్ అద్భుతంగా ఉండడంతో.. థియేటర్లు జై హనుమాన్ తో నినాదాలతో ఉర్రూతలూగిపోతున్నాయి. ఇక క్లైమాక్స్ లో హనుమాన్ ఎంట్రీకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి.
ఇలా ప్రస్తుత పరిస్థితులు హనుమాన్ కు సింక్ కావడంతో ..ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా మౌత్ టాక్ తో హనుమాన్ దూసుకెళ్తోంది. ఇక తెలుగులో కూడా పెద్ద సినిమాల హడావిడి తగ్గితే హనుమాన్ మరిన్ని థియేటర్లు పెరగడం ఖాయం. దీంతో పది రోజుల పాటు హనుమాన్ మంచి కలెక్షన్లు రాబట్టుకోవడం ఖాయం.