Ram Mandir Construction : రామమందిర నిర్మాణం అత్యద్భుతం..సిమెంట్, ఇనుము వాడని గొప్ప కట్టడం..
Ram Mandir Construction : సరయూ నది ఒడ్డున అయోధ్యలో నిర్మితమైన రామమందిరం మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. బాలరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అద్భుత వేడుక జరుగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువులు ఈ వేడుక కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రామమందిర విశేషాలపై పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. రామమందిర నిర్మాణంలో ఎలాంటి సిమెంట్, ఇనుము లేకుండా దీని నిర్మాణం చేశారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఎలా కట్టారో మీరు తెలుసుకోండి..
రామమందిర నిర్మాణం కోట్లాది మంది భక్తులకు ఆరాధన స్థలమే కాదు ఇంజినీరింగ్ లో ఒక అద్భుతమైన ఫీట్ కూడా. ఇనుము, ఉక్కు, సిమెంట్ వంటి ఆధునిక వస్తువులను ఉపయోగించకుండా, వేల సంవత్సరాల పాటు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని ఉండేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎలాంటి ట్రెడిషినల్ కన్ స్ట్రక్షన్ మెటీరియల్స్ వాడకుండా రాజస్థాన్ లోని భరత్ పూర్ లోని బన్సీ పహర్ పూర్ నుంచి ప్రత్యేకమైన గులాబీ రాయితో రామమందిరాన్ని నిర్మించారు.
ఈ రాళ్లపై ఇన్ ట్రికేట్ ప్యాటర్న్స్ అద్భుతంగా చెక్కారు. పొడవైన కమ్మీలు, లాక్స్ తో వీటిని ఒకదానికొకటి ఫిట్ చేశారు. బైండింగ్ ఏజెంట్ లేదా గ్లూ అవసరం లేకుండా చేశారు. ఈ టెక్నాలజీ వల్ల టెంపుల్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. వేలాది సంవత్సరాలు ఇది దెబ్బతినకుండా ఉండగలుగుతుంది. అలాగే పురాతన నాగర నిర్మాణ శైలిని సంరక్షిస్తుంది.
నాగర శైలి అనేది ఉత్తర భారతంలోని మూడు ప్రధాన హిందూ దేవాలయ నిర్మాణ శైలులలో ఒకటి. మిగతావి ద్రవిడ, వేసర శైలులు. ఈ నాగార శైలిలో ఎత్తైన వంపు తిరిగిన టవర్ ఉంటుంది. ఇది మందిరంపై ఉంటుంది. అలానే ఈ శైలి అనేక గదులు, వరండాలతో రెక్టాంగ్యులర్ లేఔట్ ను కలిగి ఉంది. నాగార శైలి వింధ్య, హిమాలయాల మధ్య ప్రాంతంతో ముడిపడి ఉంది. దీని నిర్మాణంలో ఇనుమును ఉపయోగించరు. ఖజురహో టెంపుల్, సోమనాథ్ టెంపుల్, కోణార్క్ సూర్య టెంపుల్ నాగర శైలిలోనే నిర్మించారు.
అయితే రామమందిర నిర్మాణంలో మొదట్లో పలు సవాళ్లు వచ్చాయి. భూసార పరీక్షలో ఆలయం దిగువన ఉన్న భూమి వదులుగా ఉన్న ఇసుకతో నిండి ఉందని, ఇది భారీ నిర్మాణానికి పనికిరాదని తేలింది. ఈ సమస్యను పరిష్కరించడానికి సీబీఆర్ఐ, నేషనల్ జియోఫిజికల్ సర్వే, ఐఐటీ ఢిల్లీ, ఎల్ అండ్ టీ వంటి వివిధ సంస్థలు వినూత్న పరిష్కారాన్ని రూపొందించాయి.
ఇంజినీర్లు 6 ఎకరాల భూమిలో నుంచి 14 మీటర్ల మందాన ఉన్న ఇసుకను తొలగించారు. ఆ గ్యాప్ ను 56 పొరల రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ తో నింపారు. ఇది కాలక్రమేణా రాతిగా గట్టిపడే ఒక రకమైన కాంక్రీట్. ఇది ఆలయం సరిగా రెస్ట్ కావడానికి బలమైన పునాదిని సృష్టించింది.