Prashanth Varma Father : హను-మాన్ చూసి ప్రశాంత్ వర్మ తండ్రి ఏమన్నాడో తెలుసా?
‘పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించిపుడె పుట్టదు.. జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!’
సుమతీ శతకమైన ఈ పద్యం ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. పుత్రుడు పుట్టినప్పుడే తండ్రికి ఎలంటి ఆనందం పుట్టదు.. ఆ పుత్రుడి పనులు, చేష్టల ద్వారా జనులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తితే అప్పుడు పొందుతాడు. ఇది అక్షరాల నిజమే కదా. గొప్ప గొప్ప మహాను భావులు ఎంతో మంది తమ తల్లిదండ్రులు, పుట్టిన ప్రదేశం, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతారు.
ఇటీవల రిలీజైన ‘హను-మాన్’ బాక్సీఫీస్ టాక్ తో థియేటర్లలో సునామీ సృష్టిస్తుందని అందరికీ తెలిసిందే. ఈ సినిమా తేజ సజ్జతో పాటు ప్రశాంత్ వర్మ కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది. మొదట తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఎక్కువ థియేటర్లు కేటాయించలేదు. పోటీగా మరో స్టార్ సినిమా రావడంతో దీనికి తక్కు థియేటర్లు కేటాయంచారు. అయినా హౌజ్ ఫుల్ బుకింగ్స్ తో దూసుకుపోవడంతో 2వ రోజు నుంచి థియేటర్లను పెంచుకుంటూ పోతున్నారు.
ఇది ఇలా ఉంటే.. ఈ సినిమాను సినీ దర్శకుడు ప్రశాంత్ వర్మ చూశారు. థియేటర్ నుంచి బయటకు వస్తుండగా.. జర్నలిస్ట్ లు ఆయనను (ప్రశాంత్ వర్మ తండ్రి అని తెలియకుండానే) సినిమా ఎలా ఉందని ప్రశ్నించారు. ‘ఆ సినిమా తీసినోడు నా కొడుకు జీవితంలో తొలిసారి ఈ అనుభూతిని పొందాను. ప్రతీ క్యారెక్టర్ ను చక్కగా డిజైన్ చేశాడు. నాకు చాలా గర్వంగా ఉంది’ అని చెప్పాడు. ఇది కదా సక్సెస్ అంటే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.