Sankranthi : గజల్ సంక్రాంతి

Sankranthi

సంబరము సంభావన
సాయమననేమో ఎరుగని వారలకేల సంక్రాంతి
క్రాంతి కాంతుల కలల
సవ్వడి లేక వట్టి పోయిన ఏషలకేల సంక్రాంతి

నవ్వుల పువ్వుల నయము నెయ్యపు మెరుపును సుంతైన కనక తగని తగవులలో
పంతాల పందాలలొ హాళి హాయి మరచిన మత్తు చేతలకేల సంక్రాంతి

పక్షుల పాటలా పూల
పుంతలా ముగ్గులోని చుక్కల్ని కలిపె రేఖలా
మాటలనుమనసులను కలపగాలేని కులమతా
ల గీతలకేల సంక్రాంతి

బంతిపూలు వన్నెలెన్నొ
ఇంతిఎదలకోర్కులెన్నొ
పోల్చుకోని ఆదలెన్నొ
వలపు లేక కలుపు పెరకలేక కసుగాయల
కోసె కోతలకేల సంక్రాంతి

మల్లీ! ఆమని వేళ కింకిరమాలపించు కీర్తన పంచే కౌతుకమందక
చీకటిగ మిగిలి సుజ్ఞానమవలేని
అజ్ఞానపు కూతలకేల
సంక్రాంతి

-రాజావాసిరెడ్డి మల్లీశ్వరి

TAGS