Today Horoscopes : నేటి రాశి ఫలాలు
Today Horoscopes : మేష రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. దుర్గాదేవి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
వ్రషభ రాశి వారికి సంతోషంతో కాలం గడుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. చంద్ర శ్లోకం చదవడం శుభాలు కలిగిస్తుంది.
మిథున రాశి వారికి భవిష్యత్ గురించి ప్రణాళికలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దుర్గా శ్లోకం చదువుకోవడం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి వారికి ముఖ్యమైన పనుల్లో ప్రశంసలు దక్కుతాయి. ప్రయాణాల్లో మంచి లాభాలున్నాయి. ఒక శుభవార్త మీకు సంతోషం కలిగిస్తుంది. శ్రీరాముడిని దర్శించడం మంచిది.
సింహ రాశి వారికి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సూర్య నమస్కారం నూతన శక్తిని ఇస్తుంది.
కన్య రాశి వారికి అనవసర గొడవలకు వెళ్లకండి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో పనులు పూర్తవుతాయి. నవగ్రహ ధ్యానం శుభకరం.
తుల రాశి వారికి అందరిని నమ్మకూడదు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సూర్య నమస్కారాలు శక్తిని పెంచుతాయి.
వ్రశ్చిక రాశి వారికి ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. ఇష్టదేవతారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.
ధనస్సు రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గారాధన చేయడం శుభకరం.
మకర రాశి వారికి ధనలాభ సూచనలున్నాయి. ప్రశాంతంగా ఉంటారు. మాటకు కట్టుబడి ఉండాలి. ఇష్టదేవతారాధన శ్రేయస్కరం.
కుంభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదుర్కొంటారు. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మీ స్తోత్రం చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి వారికి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధికారుల అండ ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు బాధిస్తాయి. దుర్గా ఆరాధన శుభ ఫలితాలు కలిగిస్తుంది.