Ishan Kishan : ఇషాన్ పై బీసీసీఐకి కోపమెందుకొచ్చింది..ఆమెతో కలిసి అక్కడికి వెళ్లినందుకేనా..?
Ishan Kishan : ఆఫ్ఘనిస్తాన్ తో టీ-20 మ్యాచ్ లకు బ్యాటర్ ఇషాన్ కిషన్ కు బీసీసీఐ చాన్స్ ఇవ్వలేదు. అతడి స్థానంలో సెలక్టర్లు సంజూ శాంసన్, జితేశ్ శర్మలను ఎంపిక చేశారు. ఇషాన్ పై బీసీసీఐ కోపంతోనే అతన్ని ఎంపిక చేయలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దీనికి సంబంధించి ఇషాన్ కొన్ని రోజుల కింద ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనే టీవీ షోలో కనిపించాడు. ఇది టీమ్ మేనేజ్ మెంట్ కు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి అతడు వ్యక్తిగత కారణాల వల్ల దక్షిణాఫ్రికా టూర్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఇక టీవీ షోలో మహిళా క్రికెటర్ స్మృతి మంధనతో కలిసి ఇషాన్ పాల్గొన్నాడు. ఈ విషయంపై చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు..
ఆఫ్ఘనిస్తాన్ తో 3 మ్యాచ్ ల టీ-20 సిరీస్ కు ముందు ద్రావిడ్ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో మాట్లాడుతూ.. ఇషాన్ పై క్రమశిక్షణా చర్యలు ఏమీ లేవని, ఎంపికకు ఇషాన్ అందుబాటులో లేడు. దక్షిణాఫ్రికా టూర్ లోనే విరామం కోరాడు. దానికి మేం అంగీకరించాం. అందుకే ఆఫ్ఘన్ తో మ్యాచ్ లకు ఎంపిక చేయలేదు.. అని చెప్పాడు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్ తో 3 మ్యాచ్ ల టీ-20 సిరీస్ కు ఇషాన్ ను ఎంపిక చేయకపోవడానికి బీసీసీఐ అతడిపై ఆగ్రహంగా ఉండడమే కారణమని తెలుస్తోందని ‘క్రిక్ బజ్’ అనే నివేదిక పేర్కొంది. దక్షిణాఫ్రికా టూర్ మధ్యలో ఇషాన్ కుటుంబంతో గడపాలని, మానసికోల్లాసం కోసం విరామం కావాలని బీసీసీఐని కోరాడు. కానీ అతడు దుబాయ్ లో పార్టీలు చేసుకుంటూ కనిపించాడు. ఇది మాత్రమే స్మృతి మంధన తో కలిసి కేబీసీ లో పాల్గొన్నాడు. కుటుంబంతో గడపాలని చెప్పి ఇలా చేయడమే బీసీసీఐకి కోపం వచ్చినట్టు చెబుతున్నారు. అందుకే ఈ సిరీస్ లో అతన్ని ఎంపిక చేయక ఇతరులకు అవకాశం ఇచ్చింది.