Jail Bharo : ఏపీలో ఉద్రిక్తంగా మారిన జైల్ భరో

Jail Bharo

Jail Bharo police arrests

Jail Bharo : ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల ఆందోళనలు తారాస్థాయికి చేరింది. అంగన్ వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకోవడంతో ఆగ్రహ జ్వాలలు పెరుగుతున్నాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులకు మద్దతుగా కార్మిక సంఘాలు జైల్ భరోకు పిలుపునివ్వడంతో ఆందోళన ఉగ్రరూపం దాల్చింది.

ఏపీలో సమ్మెల ప్రభావం తీవ్రమవుతోంది. 104, 108 ఉద్యోగులు కూడా ఈ నెల 23 నుంచి సమ్మె చేసేందుకు నోటీసు ఇచ్చారు. పలు జిల్లాల్లో కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, రైతు వ్యవసాయ సంఘాలు తీవ్ర తరం చేశాయి. విజవాడలో చేపట్టిన జైల్ భరో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అద్దంకిలో మున్సిపల్, అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

కాకినాడ కలెక్టరేట్లలోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. జగన్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ రహదారిపై నినాదాలు చేశారు. పాడేరులో ఆందోళనకారులను అరెస్టు చేశారు. నరసరావుపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో చేశారు. విశాఖ జైల్ భరో కార్యక్రమంలో నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల అరెస్టులపై నాయకులు మండిపడుతున్నారు. వైసీపీ నిరంకుశ విధానాలతో అందరు విసిగిపోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్నారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో పడనుందని చెబుతున్నారు. అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల అరెస్టును నిరసిస్తున్నారు. వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

TAGS