AP Elections : ఏపీలో ఎన్నికలకు వేళవుతోంది?
AP Elections : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకు ఎలక్షన్ కమిసనర్లు రాష్ట్రానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభం అయిందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని చెబుతున్నారు. ఎన్నికల కమిషనర్లకు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు స్వాగతం పలికారు.
ప్రస్తుత పరిణామాల్లో జగన్ కు ఎదురు గాలి వీస్తున్న తరుణంలో ఎన్నికలకు వెళితే ఓటమి తప్పదనే వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఎలక్షన్ కమిషనర్ల ప్రవేశంతో ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రచారంలో టీడీపీ దూసుకుపోతోంది. జగన్ మాత్రం తన మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాల బెదిరింపులతో తల పట్టుకున్నారు.
క్రిష్ణ జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ఎలక్షన్ కమిషనర్లను రోడ్డు మార్గాన విజయవాడకు తీసుకెళ్లారు. ఈ మేరకు రాష్ట్రంలో పరిస్థితులు పరిశీలించి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయనున్నారని తెలుస్తోంది.
ఎలక్షన్ కమిషనర్లు రావడంతో రాజకీయ పక్షాల్లో వేడి పుడుతోంది. ప్రచారం పెంచాలని భావిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ప్రచార హోరు పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా రా కదలి రా అంటూ ప్రజలను చైతన్యం చేస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. ఈ సారి అధికారం తమదే అని టీడీపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. జనసేనతో పొత్తులో జగన్ ను ఇంటికి సాగనంపుతామని చెబుతోంది.