Alia Bhatt : ‘ఎనిమల్’ సక్సెస్ మీట్ లో అలియా భట్ ధరించిన ఈ దుస్తుల విలువ ఎన్ని లక్షల్లో తెలుసా?

Alia Bhatt

Alia Bhatt in Animal Movie success meet

Alia Bhatt : ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘కబీర్ సింగ్’ వంటి సంచలాత్మక చిత్రాల తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ నుండి వచ్చిన మరో బాక్స్ ఆఫీస్ వండర్ ‘ఎనిమల్’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాత్మక రికార్డ్స్ ని నెలకొల్పింది. క్రిటిక్స్ ఈ చిత్రానికి నెగటివ్ రివ్యూల వర్షం కురిపించినప్పటికీ కూడా ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, యూత్ ఎంతలా ఈ చిత్రానికి ఆకర్షితులు అయ్యారో అర్థం చేసుకోవచ్చు.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సలార్ చిత్రం విడుదల లేకపోతే 1000 కోట్ల గ్రాస్ ముచ్చట కూడా తీరేది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి కేవలం తెలుగు వెర్షన్ నుండి దాదాపుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ కూడా ఈ చిత్రం రన్ కి బ్రేక్ పడింది సలార్ వల్లే.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ పార్టీ లో నిన్న మూవీ టీం మొత్తం ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఈ సక్సెస్ మీట్ కి రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్ తో కలిసి వచ్చాడు. మూవీ టీం తో పాటుగా హీరోయిన్ తమన్నా, మహేష్ భట్, నీతూ కపూర్, రామ్ గోపాల్ వర్మ, జెనీలియా మరియు రితేష్ దేశ్ ముఖ్ లు కూడా ఈ సక్సెస్ పార్టీ లో పాల్గొన్నారు. ఇంతమంది పార్టీ లో ఉన్నప్పటికీ కూడా అందరి చూపు అలియా భట్ మీదనే ఉంది. నిజంగా నిన్న సక్సెస్ పార్టీ లో ఆమె దేవకన్య లాగానే అనిపించింది. బ్లూ స్లీవ్ లెస్ డ్రెస్ లో కనిపించిన అలియా భట్ ని చూసి సోషల్ మీడియా లో కుర్రకారులు మెంటలెక్కిపోతున్నారు.

ఆమె ధరించిన ఈ డ్రెస్ ధర ఎంత ఉంటుంది అని సోషల్ మీడియా లో వెతకగా, సుమారుగ రెండు లక్షల రూపాయలకు పైగానే ఉంటుందని ఈ కామర్స్ వెబ్ సైట్స్ లో తెలిసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇకపోతే అలియా భట్ రీసెంట్ గా ‘జిగ్ర’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమాలో ఆమె కేవలం హీరోయిన్ పాత్ర మాత్రమే కాదు, నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. వరుస హిట్స్ తో మంచి ఊపు మీదున్న అలియా భట్ , ఈ సినిమాతో నిర్మాతగా కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

TAGS