Gunturukaram Trailer Review : తల్లి ప్రేమకు నోచుకోని మాస్ హీరో కథే గుంటూరుకారం..

Gunturukaram Trailer Review

Gunturukaram Trailer Review

Gunturukaram Trailer Review : త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబోలో సంక్రాంతికి వస్తున్న మూవీ ‘గుంటూరు కారం’. ఈ మూవీకి దిల్ రాజు ఎక్కువ థియేటర్లు రిజర్వ్ చేశారు. దీంతో ఇండస్ట్రీలో ఈ సినిమా బాక్సాఫీస్ పై స్టార్ హీరోలు సైతం చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు కారంకు సంబంధించి ఫైనల్ ట్రైలర్ ఈ రోజు (జనవరి 7) రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తే సినిమాపై ఎంతో కొంత క్లారిటీ వస్తుంది.

ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాగా వస్తుందని ట్రైలర్ చూసి తెలుసుకోవచ్చు. త్రివిక్రమ్ సినిమాలు చాలా వరకు ఫ్యామిలీ జానర్ లోనే సాగుతాయి. కథకు తగ్గట్లు మంచి మంచి మాటలను కూర్చుతూ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తాడు. ‘గుంటూరు కారం’ను కూడా ఫ్యామిలీ డ్రామాగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ట్రైలర్ లో సాధారణ సినీ ప్రేక్షకుడిని కట్టిపడేసే డైలాగులు వినిపించాయి. కానీ, కంటెంట్ పెద్దగా వర్కవుట్ అయినట్టుగా కనిపించట్లేదు. ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్ గత సినిమాల వాసనలే ఉన్నాయని అనిపిస్తుంది. రమ్యకృష్ణ.. మహేష్ బాబు మధ్య మదర్ అండ్ సన్ కోర్ ఎమోషన్ ప్లాట్ నడుస్తుందని తెలుస్తుంది.

తల్లీ కొడుకుల మధ్య వచ్చే సీన్లను హైలైట్ చేస్తూ తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది.
మహేశ్ బాబు డైలాగులు కొంత వరకు ఓకే అనిపించినప్పటికీ అవి త్రివిక్రమ్ స్టాండింగ్ డైలాగుల్లా అనిపించడం లేదు. గతంలో త్రివిక్రమ్ లో అతడు చేసిన మహేశ్ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇందులో ఇవ్వలేదని తెలుస్తోంది. కమర్షియల్ సినిమా అంటే చాలా పెద్ద టాస్క్ పర్ఫెక్ట్ గా చేయకుంటే సినిమాను నాశనం అవుతుంది.

ఇక, అందులో టాప్ హీరోతో కమర్షియల్ మూవీ చేయడం కత్తి మీద సామే. ఏ మాత్రం అటు ఇటైనా మొదటికే మోసం. ఇలాంటి సమయంలో రిలీజైన ఈ ట్రైలర్ జనాన్ని ఆకట్టుకోలేదని తెలుస్తోంది. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ట్రైలర్ లో ఈ సినిమాలో ఉండే ఆర్టిస్టులందరినీ ఎస్టాబ్లిష్ చేశారు. వారిని ఏ విధంగా వాడుకున్నాడు సినిమాకు వాళ్లు ఎంతవరకు ప్లస్ అయ్యారు అనే విషయం సినిమా చూస్తే గానీ క్లారిటీ రాదు.

TAGS