Teja Sajja : చైల్డ్ ఆర్టిస్టుగా 5 వేలు తీసుకున్న తేజ సజ్జ..ఇప్పుడు ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా తెలుసా?
Teja Sajja : బాలనటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ కిడ్ గా మంచి పేరు తెచ్చుకున్న వారిలో తేజ సజ్జ ఒకడు. దాదాపుగా ఈయన నేటి తరం స్టార్ హీరోలతో పాటుగా, సీనియర్ హీరోలతో కూడా అనేక సినిమాలు చేసాడు. అందరితో మంచి కనెక్షన్ కూడా ఉంది. చైల్డ్ ఆర్టిస్టుగా చేస్తున్న రోజుల్లో తేజ తన మొదటి సినిమాకి 5 వేల రూపాయిలు తీసుకున్నాడట. ఇప్పుడు తేజ సజ్జల హీరో గా మారాడు.
పలు సినిమాలు చేసాడు, కానీ వాటిల్లో కేవలం ‘జాంబీ రెడ్డి’ అనే చిత్రం మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. మిగిలిన చిత్రాలు పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఆయనతో ‘జాంబీ రెడ్డి’ లాంటి సూపర్ హిట్ సినిమాని చేసిన ప్రశాంత్ వర్మ, మళ్ళీ అతనితో ‘హనుమాన్’ అనే సినిమా తీసాడు. ఈ సినిమా కోసం కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాదు, బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆత్రుతో ఎదురు చూస్తున్నారు.
జనవరి 12 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని రేంజ్ వసూళ్లను రాబడుతుందనే చెప్పాలి. ఒక స్టార్ హీరో సినిమాకి ఉన్నంత క్రేజ్ మరియు హైప్ ఈ సినిమాకి ఉంది. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియా నే కనిపిస్తుంది. ఈ సినిమా విడుదల రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రం కూడా విడుదల అవుతుంది. ఆ సినిమాని కూడా ఈ చిత్రం డామినేట్ చేస్తుందంటే, ఈ సినిమాకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే చిన్నతనం లో ఒక్కో సినిమాకి 5 వేల రూపాయిలు తీసుకునే తేజా, ఇప్పుడు ఏకంగా కోటి రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడట. హనుమాన్ చిత్రం పెద్ద హిట్ అయితే ఆయన రెమ్యూనరేషన్ ని ఇంకా పెంచే అవకాశం కూడా ఉంది.
అయితే ఈ సినిమాకి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా థియేటర్స్ రానివ్వకుండా కుట్రలు చేస్తున్నారు. నిర్మాత నిరంజన్ రెడ్డి నేరుగా మీడియా ముందుకు వచ్చి ‘గుంటూరు కారం’ నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పై తన అసహనం ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వంటి సిటీ లో ఈ చిత్రానికి కేవలం నాలుగు థియేటర్స్ దొరికాయి అంటే, ఏ రేంజ్ లో ఈ చిత్రాన్ని తొక్కేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి, కమర్షియల్ గా ఈ సినిమా ఏ రేంజ్ కి వెళ్లబోతుంది అనేది.