NEET Exam : జులైలో నీట్ పీజీ పరీక్ష
NEET Exam : పోస్టు గ్రాడ్యుయేషన్ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) జులై మొదటి వారంలో నిర్వహించనున్నారు. ఆగస్టు మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ను ఈ ఏడాది నిర్వహించడం లేదు. 2018 పీజీ వైద్య నిబంధనలను సవరించి నోటిఫై చేసిన పీజీ వైద్య నిబంధనలు 2023 ప్రకారం నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. పీజీ ప్రవేశాలకు నెక్ట్స్ అమల్లోకి వచ్చే వరకు కొత్త నిబంధనల ప్రకారం నీట్ పీజీ జరగనున్నట్లు చెబుతున్నారు.
మెడికల్ కళాశాలల్లో మాస్టర్ ఆఫ్ సర్జరీ (ఎంఎస్), డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ) పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు నీట్ పీజీ నిర్వహిస్తారు. మెడికల్ కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్య్థర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీని కంటే ముందు అభ్యర్థులు మార్చి 31 వరకు ఇంటర్న్ షిప్ గడువు ఉంటుంది.
మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్ష దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా, డీఎన్ బీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా 271 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందులో వచ్చిన మార్కులతో అడ్మిషన్లు ఉంటాయి.