Boyapati Srinu : బోయపాటి శ్రీను కి అప్పోయింట్మెంట్ ఇవ్వని జూనియర్ ఎన్టీఆర్..ఆ ద్రోహం ఇంకా మర్చిపోలేదా!
Boyapati Srinu : కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రతీ ఇండియన్ ని గర్వంగా ఇది మా ఇండియన్ సినిమా అని చెప్పుకునేలా చేసిన చిత్రం #RRR. గ్లోబల్ వైడ్ గా ఈ సినిమాకి వచ్చిన రీచ్ ఇండియా లో ఏ సినిమాకి కూడా రాలేదు. కలలో కూడా సాధ్యం కాదు అని అనుకున్న ఆస్కార్ అవార్డుని కూడా గెలుచుకుంది ఈ చిత్రం. దీంతో ఈ సినిమాలో హీరోలు గా చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు మంచి క్రేజ్ వచ్చింది.
గ్లోబల్ స్టార్స్ గా ఇద్దరి పేర్లు ప్రపంచం మొత్తం మారుమోగిపోయాయి. ఇకపోతే #RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్నాడు. చాలా వరకు షూటింగ్ టాకీ పార్టీ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా, అతి ఏప్రిల్ 4 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎన్టీఆర్ ని కలిసే ప్రయత్నం చేసాడట.
ఈ వార్త తెలియగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఇతను ఎందుకు ఇప్పుడు ఎన్టీఆర్ ని కలుస్తున్నాడు, ఎన్టీఆర్ ఉన్న రేంజ్ కి బోయపాటి తో సినిమా తీస్తాడా ఏంటి కొంపదీసి అని ఫ్యాన్స్ భయపడ్డారు. ఎన్టీఆర్ అభిమానుల మాట విన్నాడో ఏమో తెలియదు కానీ, బోయపాటి శ్రీను కి కనీసం అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. ఇదే ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతున్న చర్చ. అభిమానులను కూడా తన ఇంటికి ఆహ్వానించి మర్యాదలు చేసే ఎన్టీఆర్, బోయపాటి శ్రీను విషయం లో ఎందుకు ఇలా చేసాడు అని మీకు అనుమానం రావొచ్చు. కానీ వీళ్ళ మధ్య అప్పట్లో పెద్ద గొడవే జరిగిందట. వీళ్లిద్దరి కాంబినేషన్ లో 2012 వ సంవత్సరం లో ‘దమ్ము’ అనే చిత్రం తెరకెక్కింది.
ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దీనికి కారణం బోయపాటి శ్రీను అని తెలిసి, ఎన్టీఆర్ అతనిని బూతులు తిట్టాడట. ఎందుకంటే తనకి చెప్పిన కథ ఒకటి, తీసిన సినిమా మరొకటి. అంతే కాకుండా ఎన్టీఆర్ అనుమతి లేకుండా సినిమాలో ఎన్నో మార్పులు చేర్పులు చేసాడట. ఈ విషయం లో ఇద్దరి మధ్య అప్పట్లో పెద్ద యుద్ధమే నడిచింది అట. అప్పటి నుండి నేటి వరకు ఇద్దరి మధ్య మాటలు లేవని, ఎన్టీఆర్ పాతవి ఇంకా మర్చిపోలేదు కాబట్టే, బోయపాటి కి అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు.