Telangana Politics : కాళేశ్వరం కేసు.. బీజేపీ పాలి‘ట్రిక్స్’.. ఎవరి కోసం?

Kaleswaram case : గత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో మొదటి ప్రాధాన్యం కాళేశ్వరం ప్రాజెక్టుదే. అదే వారి రెండోసారి విజయానికి ప్రధాన కారణమైంది. ఇప్పుడదే కాళేశ్వరం మొన్నటి ఎన్నికల్లో వారి ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటైంది. ఎన్నికలు ముగిసినా కాళేశ్వరంలో జరిగిన అవినీతి అంశమే పొలిటికల్ గేమ్ ఛేంజర్ గా మారుతోంది.

కాంగ్రెస్ లో జరిగిన అవినీతి నిగ్గు తేల్చాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం జ్యూడీషియల్ విచారణకు నిర్ణయించింది. ఈలోపు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా తెర ముందుకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి ఎందుకు సిఫారసు చేయడం లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శిస్తోంది. గతంలో సీబీఐ విచారణ కోరారు కదా.. ఇప్పుడేందుకు అడగడం లేదు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేయిస్తే వేల కోట్ల అవినీతి బయటకు వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే బీజేపీ కూడా మొదటి నుంచి కూడా ప్రశ్నిస్తూనే ఉంది. గతంలో రేవంత్ ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేశారు కానీ విచారణ జరగలేదు. సీబీఐ విచారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాల్సి ఉంటుందని హితువు పలికారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టే అధికారంలో ఉంది కాబట్టి సీబీఐకి ఆ పార్టీ సిఫార్సు చేస్తే రెండు రోజుల్లో విచారణ ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి కాంగ్రెస్ కు సవాల్ విసిరారు.

కాగా, కాళేశ్వరంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర లేదని అందరికీ తెలుసు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ పలు రకాల రూల్స్ ఉల్లంఘించి అనుమతులు, అప్పులు ఇప్పించి సహకరించింది. ఇవన్నీ జ్యూడీషియల్ విచారణలో బయటకు వస్తాయని బీజేపీ సీబీఐ విచారణకు పట్టుపడుతోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాళేశ్వరం బడా కాంట్రాక్టర్ బీజేపీ కూడా వందల కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇవన్నీ బయటకు వస్తాయని, సీబీఐ విచారణ పేరుతో కాలయాపన చేయవచ్చని, లేదంటే ఏదో నివేదిక ఇచ్చి కేసు క్లోజ్ చేయవచ్చని బీజేపీ స్కెచ్ అని చెపుతున్నారు.

మొత్తానికి రెండు పార్టీలు కాళేశ్వరంపై విచారణ కోరుతున్నాయి. విచారణ ఎవరు చేస్తారు.. ఎవరు నిజాల్ని బయట పెడుతారనేదే సస్పెన్స్. ఇక భవిష్యత్ రాజకీయాల్లో కూడా కాళేశ్వరమే కీలకం కావడం పక్కాగా కనిపిస్తోంది.

TAGS