Singer Sunita : రహస్యంగా మొదటి భర్త ని కలుస్తున్న సింగర్ సునీత.. వైరల్ అవుతున్న కామెంట్స్!
Singer Sunita : సౌత్ ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సింగర్స్ లో ఇప్పటికీ మంచి డిమాండ్ తో కొనసాగుతున్న సింగర్స్ లో ఒకరు సునీత. రామ్ గోపాల్ వర్మ నిర్మాణం లో కృష్ణవంశీ దర్శకత్వం లో వచ్చిన ‘గులాబీ’ చిత్రం ద్వారా ఈమె ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ చిత్రంలోని ‘ఈ వేళలో నీవు..ఏం చేస్తూ ఉంటావో’ అనే ఎవర్ గ్రీన్ మెలోడీ సాంగ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సాంగ్ ని పాడింది సునీత గారే.
ఇప్పటికీ ఈ పాట చాలా మంది వ్యక్తిగత ప్లే లిస్ట్ లో ప్లే అవుతూనే ఉండి ఉంటుంది. అలాంటి ఎవర్ గ్రీన్ పాటలు ఎన్నో పాడింది సునీత. రీసెంట్ గా ఆమె పాడిన పాటలలో ‘నీలి నీలి ఆకాశం’ అనే పాట ఎంత పెద్ద చార్ట్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లోనే ఆమె రామ్ అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
పెళ్ళికి ఎదిగిన కొడుకు, కూతుర్ని పెట్టుకొని వాళ్లకు పెళ్లి చెయ్యకుండా, నువ్వు పెళ్లి చేసుకోవడం ఏమిటి అని సునీత పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడ్డారు. తన ఇద్దరు పిల్లల కోరిక మేరకే నేను రెండవ పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సునీత. ఇది ఇలా ఉండగా సునీత మొదటి భర్త పేరు కిరణ్ కుమార్ గోపరాజు. తనకి 19 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఇతనిని పెళ్లి చేసుకుంది. కొంతకాలం వరకు సజావుగానే వీళ్ళ కాపురం సాగింది కానీ, మధ్యలో విభేదాలు ఏర్పడడం వల్ల విడిపోయారు. రీసెంట్ గా సునీత తనయుడు ఆకాష్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన సొంత తండ్రి గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘మా నాన్న తో నేను, నా చెల్లి ఇప్పటికీ మాట్లాడుతూనే ఉంటాం. నెలకి కనీసం ఒకసారైనా కలుస్తుంటాం. మా అమ్మ ఎలాంటి అభ్యంతరం చెప్పదు. మాతో పాటుగా రెండు సార్లు మా నాన్న ని ఈమధ్యనే కలిసింది కూడా’ అని చెప్పుకొచ్చాడు ఆకాష్.
ఆయన హీరో గా పరిచయం అవుతూ ‘సర్కారు నౌకరి’ అనే చిత్రం తెరకెక్కింది. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ సాధించలేకపోయింది కానీ ఆకాష్ కి మాత్రం మంచి పేరుని తెచ్చిపెట్టింది. మొదటి సినిమాతోనే ఇలాంటి మంచి ప్రయత్నం చెయ్యడం చాలా గొప్ప, ఇలాంటి మంచి సినిమాలే చేస్తుండాలి అని ఆకాష్ కి క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్ వచ్చాయి.