Sruthi Haasan:క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?
Sruthi Haasan:టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ తను గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న శంతను హజారికాను సీక్రెట్‌గా వివాహం చేసుకుందా? అంటూ వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజా ప్రచారంపై హీరోయిన్ శృతిహాసన్ స్పందించారు. తన పెళ్లిపై గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. `నేను హజారికాను పెళ్లి చేసుకోలేదు. ప్రతి విషయం గురించి స్పష్టంగా క్లారిటీ ఇచ్చే నేను పెళ్లి విషయాన్ని ఎందుకు దాస్తాను. ఇకనైనా ట్రోలర్స్ శాంతించండి` అంటూ చురకలంటించింది.
శతితో పాటు శంతను హజారికా కూడా సోషల్ మీడియా వేదికగా పెళ్లిపై స్పందించారు. `మాకు పెళ్లి కాలేదు. దయచేసి వదంతులు ఆపండి` అంటూ పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే కరోనాకు ముందు నుంచి శృతిహాసన్ ముంబాయిలో అసోంకు చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో సహజీవనం చేస్తోంది. వీరిద్దరు కలిసి ఇటీవల కొన్ని అధికారిక ఈవెంట్లలోనూ పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ కలిసి ఉన్న వీడియోలు, ఫొటోలని షేర్ చేస్తున్నారు.
దీంతో శృతి, శంతను రహస్యంగా వివాహం చేసుకున్నారని, ఆ కారణంగానే కొంత కాలంగా కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉంటున్నారని నెట్టింట ప్రచారం మొదలైంది. ఈ ప్రచారంపై తాజాగా శృతి క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. ఇక శృతి కెరీర్ విషయానికి వచ్చే ఈ ఏడాది ఆమెకు అత్యంత కలిసొచ్చిన ఇయర్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవితో `వాల్తేరు వీరయ్య`, నందమూరి బాలకృష్ణతో `వీర సింహారెడ్డి` వంటి సినిమాల్లో నటించి వరుస విజయాల్ని సొంతం చేసుకుంది.
ఇక నేచురల్ స్టార్ నాని నటించిన `హాయ్ నాన్న`లోని ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్`తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో వసూళ్ల సునామీని సృష్టిస్తుందో తెలిసిందే.