Guntur Karam:మ‌హేష్ – శ్రీ‌లీల ఇద్ద‌రూ చిత‌క్కొట్టేశారు:ప్రొడ్యూస‌ర్ నాగ‌వంశీ

Guntur Karam:సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఫ్యామిలీ యాక్ష‌న్ డ్రామా `గుంటూరు కారం`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. టాలీవుడ్ హాట్ అండ్ క్రేజీ హీరోయిన్స్ శ్రీ‌లీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. త్రివిక్ర‌మ్ మార్కు ఫ్యామిలీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న సంక్రాంతికి ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే టీమ్ ప్ర‌మోష‌న్స్‌ని ప్రారంభించేసింది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సింగిల్స్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోగా `ఓ బేబీ`.. అంటూ సాగే పాట‌పై వివాదం చెరేగిన విస‌యం తెలిసిందే. రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన ఈ పాట‌ని మ‌హేష్‌, శ్రీ‌లీల‌పై చిత్రీక‌రించారు. అయితే పాట అంతగా లేద‌ని, లిరిక్స్ అస్స‌లే అర్థం కావ‌డం లేద‌ని నెటిజ‌న్‌లు సెటైర్లు వేయ‌డం, దానికి రామ‌జోగ‌య్య శాస్త్రి అదే స్థాయిలో ఫైర్ కావ‌డం తెలిసిందే.

త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని కీలక పాత్ర‌ల్లో జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, జ‌య‌రామ్‌, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వ‌ర‌లో `గుంటూరు కారం`లోని మ‌రో స్పైసీ సాంగ్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ పాట‌పై యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ పాట‌లో మ‌హేష్‌, శ్రీ‌లీల మాస్ స్టెప్పుల‌తో అద‌ర‌గొట్టేశార‌ని వెల్ల‌డించారు.

`గుంటూరు కారం`లోని మాస్ స్పైసీ సాంగ్ విజువ‌ల్స్ చూశాను. సూప‌ర్ స్టార్ మ‌హేష్‌, శ్రీ‌లీల ఇద్ద‌రూ ఈ పాట‌లో చిత‌క్కొట్టేశారు. ఈ పాట ప్ర‌పంచ వ్యాప్తంగా తెర‌పై ప్రేక్ష‌కుల్ని విశేషంగా అల‌రిస్తుంది.. మ‌న మాస్ భాష‌లో చెప్పాలంటే ఆ కుర్చీని మ‌డ‌త‌పెట్టీ…` అంటూ లౌడ్ స్పీక‌ర్ వ్యాల్యూమ్ ఎమోజీల‌ని షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

TAGS