Pranay Vanga:40కోట్లు న‌ష్ట‌పోయామ‌న్న `యానిమ‌ల్` నిర్మాత‌

Pranay Vanga:యానిమల్ సినిమా కలెక్షన్లపై నిర్మాత ప్రణయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తన సినిమా రూ.800 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలిపారు. వసూళ్ల విషయంలో నిజాలు చెబుతున్నామ‌ని, ఇందులో అబ‌ద్ధాలేవీ లేవ‌ని అన్నారు. మేము ఇంకా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరలేదు. డిస్ట్రిబ్యూటర్లు వేసిన లెక్కల ప్రకారం థియేటర్లు లేకపోవడంతో మొదటి వారంలో దాదాపు రూ.40 కోట్లు నష్టపోయాం. లాంగ్ వీకెండ్ లేకపోవడం, ఎ సర్టిఫికేట్ సినిమా కావడం, 3.21 గంటల నిడివి, సామ్ బహదూర్ ఒకేసారి విడుదల కావడం అన్నీ కారణాలే. ప్రేక్షకులు మా సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ థియేటర్లు సరిగ్గా దొరకడం లేదు.

దీంతో మొదటి వారంలో కలెక్షన్లు కాస్త తగ్గాయి. నిడివి ఎక్కువైందని ఎవరూ పట్టించుకోలేదు. కాకపోతే సెకండాఫ్‌లోని కొన్ని సన్నివేశాల గురించి చాలా మంది వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా అందరినీ సంతృప్తి పరచడం అసాధ్యం. ప్రస్తుతం సందీప్ ఓటీటీ వెర్షన్ యానిమల్ కోసం పని చేస్తున్నాడు. `కొత్త దృశ్యాలను జోడించాలా? వ‌ద్దా అనేది మేం ఆలోచిస్తున్నాము. ఎందుకంటే, నెట్‌ఫ్లిక్స్ ఇండియా కొత్త నిబంధనల ప్రకారం, సెన్సార్ పూర్తయిన తర్వాత మాత్రమే వారు తమ OTT ప్లాట్‌ఫారమ్‌లో సినిమాను విడుదల చేయాలి. కొత్త సన్నివేశాలను జోడించి మళ్లీ సెన్సార్‌కి వెళ్లాలా? లేక థియేట్రికల్ వెర్షన్ లోనే విడుదల చేయాలా? అనేది చూస్తున్నాం` అన్నాడు ప్రణయ్.

రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘యానిమల్’. అనిల్ కపూర్, బాబీ డియోల్ , త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలు పోషించారు. తండ్రీకొడుకుల సెంటిమెంట్లతో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని టి సిరీస్ – భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యానిమల్ కి సీక్వెల్ గా యానిమల్ పార్క్ తీయనున్నట్టు సందీప్ వంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్ కు కాస్త సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాతో సందీప్ బిజీ కానున్నాడని ప్రణయ్ తెలిపాడు. ఆ ప్రాజెక్ట్‌ పూర్తయిన తర్వాతే యానిమల్‌ పార్క్‌ నిర్మిస్తాడు.

TAGS