AP Liquor Case : ఏపీలో మద్యం కేసు.. ఆ అధికారిని బెదిరించేందుకేనా..?
AP Liquor Case : టీడీపీ అధినేత చంద్రబాబుపై వరుస కేసులు పెడుతూ ఏపీ సీఐడీ ముందుకెళ్తున్నది. అయితే తాజాగా మరో కేసు ఓపెన్ చేసింది. ఇది మద్యం కేసు. ఇందులో జరిగిన అవినీతి ఏంటో మాత్రం వెల్లడించలేదు. చంద్రబాబు, కొల్లు రవీంద్రలతో పాటు మరో ఐఏఎస్ అధికారి పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టారు. అయితే ఈ కేసులో లక్ష్యం అంతా చంద్రబాబు అనుకున్నారు. అయితే ఆ అధికారిని ఇబ్బంది పెట్టేందుకే ఈ కేసును వేశారని చర్చ ఇప్పుడు ఏపీలో జోరుగా జరుగుతున్నది.
ఏపీలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేశ్ కుమార్ ను బెదిరించేందుకే ఈ కేసును ఓపెన్ చేసినట్లు తెలుస్తున్నది. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు నాడు ఎక్సైజ్ శాఖలో కీలక అధికారిగా ఉన్న ప్రస్తుత చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పై కుట్రలో భాగంగా కేసు పెట్టినట్లు తెలుస్తున్నది. అయితే ఏపీలో దర్యాప్తు సంస్థల తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్నది. చంద్రబాబుపై వరుసగా పెడుతున్న కేసులపై విమర్శలు వస్తున్న సీఐడీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
అయితే ఇప్పుడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నే టార్గెట్ చేస్తూ కేసు పెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే ప్రచారం జరుగుతున్నది. అయితే 2024లో ప్రభుత్వం మారితే మరి ఈ అధికారుల పరిస్థితి ఏంటోనని తోటి అధికారులే గుసగుసలాడుకుంటున్నారని సమాచారం. జగన్ తమ వెనుక ఉన్నారని ఇంతలా రెచ్చిపోతున్న అధికారులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పవని అనుకుంటున్నారు. ఇక ఓటరు జాబితాలో అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు, రానున్న ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ కేసును పెట్టారనేది నిజమైతే మాత్రం ఆ అధికారులకు ఇబ్బందులు తప్పవు.