Largest Childrens Museum : ప్రపంచంలోని అతిపెద్ద పిల్లల మ్యూజియం.. ఎక్కడుందో తెలుసా?

largest childrens museum

largest childrens museum

మ్యూజియం ముఖద్వారం..

Largest childrens museum: చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంను ఏటా 10 లక్షల మందికి పైగా చిన్నారులు విజిట్ చేస్తారంటే ఆశ్చర్యంగా లేదు.. అవునండీ ఈ మ్యూజియం ప్రత్యేకంగా చిన్నారుల కోసమే. ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు. చిన్నారులకు మ్యూజియంలో అన్ని విషయాలను చరిత్రతో సహా చెప్తారు. అమెరికాలోని ఇండియానాపోలిస్ లో నిర్మించిన ఈ మ్యూజియంను ఏటా లక్షల సంఖ్యలో చిన్నారులు సందర్శిస్తారు.

మేరీ స్టూవర్ట్ కారే అనే వ్యాపార వేత్త 1924లో బ్రూక్లిన్ అనే బాలల మ్యూజియం చూశాడు. అప్పటి నుంచి పిల్లల కోసం దాని కంటే పెద్దడిగా ఉండేలా మ్యూజియంను నిర్మించాలని అనుకున్నాడు. కొంత మంది దాతలను కలిసి విరాళలు సేకరించారు. ఆయన కృషి నేపథ్యంలో ఇండియానాపోలీస్ ప్రాంతంలో 1925లో ఒక మ్యూజియంను ఏర్పాటైంది. అయితే అది చిన్నగా ఉండడంతో మరింత విస్తరించాలన్న సంకల్పంతో ఇప్పుడు ఉన్న చోటికి 1946లో తరలించారు.

ఏడున్నర ఎకరాల ఆల్ఫ్రెస్కో మినహా 4,72,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మ్యూజియం విస్తరించి ఉంది. ఇక్కడ చిన్నారుల కోసం కార్ రేసింగ్‌తో సహా అనేక క్రీడలు అందుబాటులో ఉంచారు. వీటితో పాటు అనేక గ్యాలరీలు కూడా ఉన్నాయి. మ్యూజియం బయట అతిపెద్ద డైనోసార్ల బొమ్మలు ఉంటాయి. వీటితో పాటు మొదటి అడుగు డైనోసార్ల గ్యాలరీలోకే తీసుకెళ్తుంది.

largest childrens museum

మ్యూజియంలో ని గ్యాలరీ

ఈ గ్యాలరీ పక్కనే గాజు గోడల ల్యాబ్‌లో డైనోసారస్ అస్థిపంజరం కూడా ఏర్పాటు చేశారు. మ్యూజియంలో గైడ్లు కూడా అందుబాటులో ఉన్నారు. సైన్స్, స్పేస్, బొమ్మల (50 వేలకంటే ఎక్కువ)ను ఎక్కువగా ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి, గ్రీస్ ఇల్లు, బేకరీ, వార్తాపత్రిక కియోస్క్, సాంప్రదాయ దుస్తులు, నృత్య రూపంలో కూడా గ్రీస్ కళాకారుల బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేుశారు. ఈ మ్యూజియంలో ప్రతీ నాలుగు లేదంటే ఐదు సంవత్సరాలకు ఒక కొత్త దేశంలోని సంప్రదాయ పద్ధతులు, అక్కడి జీవ జంతు జాతి అస్థిపంజరాలు, వస్తువులను ప్రదర్శనకు ఉంచుతారని గైడ్లు చెప్తున్నారు. క్రిస్మస్ వేడుకలకు ఎక్కువ మంది చిన్నారులు ఈ మ్యూజియంను సందర్శిస్తారని నిర్వాహకులు చెప్తున్నారు.

TAGS