CM Revanth:విద్యుత్‌పై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సీఎం రేవంత్ ఆదేశం
CM Revanth:తెలంగాణ అసెంబ్లీ సమావేశం రోజు రోజుకూ హీటెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షల మధ్య వాడీ వేడీ చర్చజరుగుతోంది. అంతే కాకుండా అధికార పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. గురువారం కీలక విద్యుత్ రంగంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు. దీనిపై సభ్యుల మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్‌రెడ్డి పవాల్ను స్వీకరిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం సరికొత్త టర్న్ తీసుకున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ `యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ సహా ఛత్తీస్‌గడ్‌తో ఉద్యుత్ ఒప్పందం, భద్రాద్రి పప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకంపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం లోపభూయిష్టంగా ఉంది. ఒప్పందాల వెనక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలి. టెండర్లు లేకుండా ఒప్పందాలు చేసుకున్నారు. దీనిపై మేం ఆనాడే పోరాటం చేస్తే మార్షల్స్‌తో మమ్మల్ని సభ నుంచి బయటకు పంపారు.
ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెబితే ఆ ఉద్యోగి హోదా తగ్గించి మారుమూల ప్రాంతాలకు పంపించారు. ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల విద్యుత్ ఒప్పందం చేసుకోగా దీని వల్ల లప్రభుత్వంపై రూ.1362 కోట్ల భారం పడింది. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగింది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తాం. వ్యవసాయ విద్యుత్ అనేది ప్రజల సెంటిమెంట్. దీని ఆధారంగా ఒప్పందాలు చేసుకున్నారు. వాటితో ఇండియా బుల్స్ కంపెనీకి లాభాన్ని చేకూర్చి రాష్ట్రాన్ని ముంచేశారు` అంటూ సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు.