Animal:ఆ మెషీన్ గన్ మేకింగ్ కోసం 100మంది పని చేసారా?
Animal Mechine Gun:ఇటీవలి కాలంలో భారీ యాక్షన్ చిత్రాల శైలిని పరిశీలిస్తే.. ప్రతి సినిమాలో ఒక భారీ మెషీన్ గన్ ని దర్శకులు చూపిస్తున్నారు. ఇంతకుముందు విక్రమ్ సినిమాలో లోకేష్ కనగరాజ్ భారీ మెషీన్ గన్ ని ఆపరేట్ చేసే కథానాయకుడిని చూపించారు. ఆ తర్వాత సందీప్ వంగా యానిమల్ చిత్రంలో భారీ డిజైనర్ మెషీన్ గన్ ని ఉపయోగించారు. అయితే ఇవన్నీ బొమ్మ తుపాకులేనా? వీ.ఎఫ్.ఎక్స్ లో సృష్టించినవా? అనే సందేహాలు ఉన్నాయి.
రణబీర్ ఉపయోగించిన ఆ మెషీన్ గన్ నిజమైనదేనని ప్రొడక్షన్ యూనిట్ స్పష్టం చేసింది. ఈ మెషిన్ గన్ను స్టీల్‌తో రూపొందించామని, దీని తయారీకి 5 నెలల సమయం పడుతుందని ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ వివరించారు. మేకింగ్ ప్రక్రియలో సుమారు వంద మంది టెక్నీషియన్లు పని చేసారు. దీనికోసం అరటన్ను (500 కిలోల) ఉక్కును వినియోగించారు. తుపాకీని రూపొందించే సమయంలో, అందులోని సన్నివేశం ప్రేక్షకులపై ఇంతటి శాశ్వతమైన ముద్ర వేస్తుందని తాము ఊహించలేదని సురేష్ తెలిపారు. మెషిన్ గన్ రూపకల్పన చిత్ర దర్శకుడు సందీప్ ఆలోచనల ఆధారంగా రూపొందింది.
ప్రొడక్షన్ టీమ్ మెషిన్ గన్ని వినూత్నమైన డిజైన్ని నిర్ధారిస్తూ మెషిన్ గన్ని రూపొందించింది. మెషిన్ గన్ నిర్మాణంలోప్రతి చిన్న ఎలిమెంట్ ని శ్రద్ధ అంకితభావం పరిశీలించి చేసారు. సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశంలో మెషీన్ గన్ తన పాత్రను సమర్థంగా పోషించిందంటే దానికి కారణం… ఆ లుక్ డిజైన్. సందీప్ వంగా తదుపరి ప్రభాస్ కథానాయకుడిగా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ స్పిరిట్ ని తెరకెక్కించనున్నారు. అంటే మరోసారి మెషీన్ గన్స్ కి పని పడుతుందన్నమాట.