Pawans Relationship With BJP : ఏపీలో బీజేపీతో పవన్ బంధం కొనసాగేనా..? ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాతే అసలు ముచ్చట..


Pawans Relationship With BJP : ఏపీలో టీడీపీతో పొత్తుకు ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకున్నారు. రెండు పార్టీల సమన్వయ కమిటీలు క్షేత్రస్థాయిలో వర్క్ ఇప్పటికే మొదలుపెట్టాయి. ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి మ్యానిఫెస్టోను సిద్ధం చేసుకుంటున్నారు.  ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీలో తమతో కలిసి బీజేపీ రాకకోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తున్నది. కానీ అటు వైపు నుంచి ఎలాంటి సంకేతాలు మాత్రం అందడం లేదు. ఏపీలో టీడీపీతో పొత్తు విషయంలో కొంత అచితూచి వ్యవహరిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు.

అయితే తెలంగాణలో ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. ఇక ఐదు రాష్ర్టాల ఎన్నికల తర్వాతే ఏపీలో పొత్తు విషయమై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల్లో బీజేపీ గెలిస్తేనే కొంత బీజేపీ బెట్టు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఐదు రాష్ర్టాల్లోనూ ఓడిపోతే మాత్రం అది టీడీపీకి వరంగా మారనున్నది. ఇక పొత్తుల విషయంలో టీడీపీ బెట్టు చేసే అవకాశం ఉంటుంది. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టా్ల్లో కనుక బీజేపీ గెలిస్తే పరిస్థితి మరోలా ఉంటుంద. ఏదేమైనా జనసేనను పూర్తిస్థాయిలో తమవైపు తిప్పుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది. ఇదే క్రమంలో పవన్ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకే ఇష్టపడుతున్నాడు.

ఏపీలో అధికార వైసీపీని గద్దె దించేందుకు తాను టీడీపీతో కలిసి వెళ్తానని పవన్ పదే పదే ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని వెళ్తామని చెబుతున్నారు. అయితే బీజేపీ రాకుంటే ఇందులో సీపీఎం, సీపీఐ కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఐదు రాష్ర్టాల ఎన్నికల తర్వాత బీజేపీ తప్పకుండా తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికలకు కేవలం నాలుగు నెలల సమయం మాత్రమే ఉంటుంది. లేదంటే తెలంగాణలో బీజేపీ పరిస్థితే ఏపీలోనూ తయారవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏపీలో చీలనివ్వబోమని పవన్ పదే పదే చెబుతున్నారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల తర్వాత బీజేపీ నుంచి సరైన సంకేతాలు వచ్చే అవకాశమున్నది.

TAGS