Study in USA: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే?

Study in USA: భారత్ లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ-బీటెక్).. యూఎస్ లో పీజీ (ఎంఎస్) ఇది నేటి యువతరంలో కొనసాగుతున్న క్రేజ్. ఉత్తమ బోధన నుంచి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, మంచి వేతనాలు, విలాసవంతమైన సౌకర్యాలు, సామాజిక హోదా ఇవన్నీ భారతీయ యువతను విదేశాల వైపునకు అడుగులు వేయిస్తుంది. అమెరికాకు వెళ్లాలనే ఆకాంక్ష రాను రాను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విశ్వవిద్యాలయాలు, ఉద్యోగాలు తదితర వాటి గురించి తెలుసుకుందాం..

వరల్డ్ లోని టాప్ 10 యూనివర్సిటీల్లో ఎక్కువ ఉండేవి అగ్రరాజ్యానివే. సగం కంటే ఎక్కువ సంస్థలు ఆ దేశం నుంచే ఉంటాయి. అందుకే చాలా దేశాల విద్యార్థులు అక్కడ చదివేందుకు ఇష్టపడుతుంటారు. ఈ సంఖ్యను పరిశీలిస్తే ఎక్కువగా ఇండియన్స్ ఉంటారు. అక్కడ చదువుకునే విదేశీ విద్యార్థుల జాబితాలో ఇండియన్స్ వాటా 21 శాతం, ఏటా 2 లక్షల కంటే ఎక్కువ మందే ఉంటారు. వీరిలో ఎక్కువ మంది న్యూయార్స్, టెక్సాస్, కాలిఫోర్నియా, మాసాచుసెట్స్ లోని యూనివర్సిటీల్లో చదువుతున్నారు.

15 నెలల ప్రణాళిక..
బీటెక్ కంప్లీట్ చేసుకోగానే అమెరికా వెళ్లి చదువుకోవాలని అనుకుంటే బీటెక్ మూడో సంవత్సరం నుంచే ప్రణాళికలు ఏర్పరుచుకోవాలి. జీఆర్ఈ, తోఫెల్ కు సిద్ధం కావాలి. నాలుగో సంవత్సరం కోర్సులో ఉన్న సమయంలో జూన్‌ నుంచి విదేశీ విద్యకు ప్రణాళికలు రూపొందించుకోవాలి.

జూలై: జీఆర్‌ఈ, తోఫెల్‌ ఎగ్జామ్స్ కు దరఖాస్తు కోవడం.. అటెండ్ చేయడం..
ఆగస్ట్: వచ్చిన స్కోర్ తో విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవాలి.
సెప్టెంబర్: ఎస్‌ఓపీ, వ్యాసాలు, రికమెండేషన్‌ లెటర్లు, తదితరాలను సిద్ధం చేసుకోవాలి.
నవంబర్, డిసెంబర్, జనవరి: ఈ నెలల్లో ఫాల్ దరఖాస్తుల గడువు ముగుస్తుంది. ప్రాధాన్యతను అనుసరించి ఒక్కో సంస్థకు పూర్తి వివరాలతో దరఖాస్తు పెట్టుకోవాలి.
ఫిబ్రవరి, మార్చి: ఈ రెండు నెలల్లో సదరు యూనివర్సిటీల నుంచి కాల్ లెటర్ వస్తుంది.
ఏప్రిల్‌, మే: డబ్బు ఏర్పాటు చేసుకోవడం.. లేదంటే స్కాలర్‌షిప్పులు, విద్యారుణాల వంటి ఆర్థిక పరమైన అంశాలను పూర్తి చేసుకోవాలి.
జూన్‌: స్టూడెంట్‌ వీసాకు దరఖాస్తు పెట్టుకోవాలి.
ఆగస్ట్/ సెప్టెంబర్: అక్కడ విద్యాసంస్థలు రీ ఓపెన్ అయ్యే కాలం కాబట్టి ఈ నెలల ప్రారంభం వరకే అక్కడికి వెళ్తే మంచిది.

స్కోరు సరిపోదు
ఇక్కడ (ఇండియాలో) జేఈఈ అడ్వాన్స్ లో మంచి ర్యాంకు వస్తే ఐఐటీలో సీటు వస్తుంది. నీట్ లో మంచి స్కోర్ వస్తే ఎంబీబీఎస్ చదువవచ్చు. గేట్ రాసి ఎంటెక్ పూర్తి చేయచ్చు. కానీ అమెరికాలో ఎంఎస్‌ చదవాలంటే.. జీఆర్‌ఈ స్కోర్ ఒక్కటే సరిపోవదు. తోఫెల్ లేదా.. ఐఈఎల్టీఎస్ తో పాట అనేక అంశాలు కావాలి. ఇందుకు స్థిరమైన విధానం ఏదీ లేదు. ఒక్కో విద్యా సంస్థ ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంది. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఉంటే అవకాశం వస్తుంది.

ఇవి కూడా ముఖ్యమే..
విద్యార్థులు ఎంచుకున్న కోర్సులపై ప్రధానంగా దృష్టి పెడతారు. వారు ఎంచుకున్న విధానం సరైనదేనా? అందులో రాణిస్తారా తెలుసుకుంటారు. ఉదాహరణకు.. ఇంజినీరింగ్ కోర్సుల్లో సీటు కావాలనుకునే విద్యార్థుల నుంచి మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ లో వారికున్న ప్రతిభను చూస్తారు. ఈ రెండు సబ్జెక్టుల్లో పురోగతి కనిపంచాలి. పాఠశాలు, కళాశాలల్లో సాధించిన మార్కులు, కరిక్యులమ్ విట్టే, అడ్మిషన్ టెస్ట్ రిజల్ట్, తదితరాలు కూడా ముఖ్యమే..

రికమెండేషన్‌ ఏ స్థాయిలో బెటర్
ప్రవేశాలకు రికమండేషన్ కూడా ముఖ్యమే. కాబట్టి ఇది సాదా సీదా వ్యక్తివి అయితే సరిపోవు. మీ గురించి బాగా తెలిసిన వారు.. మీ గురించి చెప్పగలిగేవారి నుంచి లెటర్ ఉంటే బాగుంటుంది. రికమండ్ చేసే వారిని మెంటర్ గా ఎంచుకొని లెటర్లను పొందాలి. మీ వ్యక్తిత్వం, విలువలు, మీలో బలాలు, సమర్థత, నైపుణ్యాలు అన్నీ ఇందులో స్పృశించాలి. ప్రవేశం పొందాలనుకుంటే విద్యా సంస్థను అనుసరించి 2, 3 రికమెండేషన్‌ లెటర్లు ఉంటే మంచిది.

ఎక్స్‌ట్రా అంశాలు
చదువుతో పాటు ఎక్స్ ట్రా కరిక్యులమ్ అంశాలకు అక్కడి విద్యా సంస్థలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ప్రతీ కాలేజలో స్పోర్ట్స్‌, మ్యూజిక్‌, డిబేట్‌, ఎడిటోరియల్‌, వలంటీర్‌ తో పాటు మరికొన్ని బృందాలు ఉంటాయి. వీటన్నింటితో అక్కడి తరగతులు కొనసాగుతాయి. కాబట్టి ప్రవేశాల్లో వీటిని ప్రధానంగా గమనిస్తారు. దేనిపై ఆసక్తి ఉంది, అనుభవం ఎలా ఉందో చూస్తారు. అందుకనే యూజీలో ఉన్న సమయంలోనే ఏదైనా విభాగంలో ఆసక్తి ఏర్పరచుకోవడం, రాణించడం చేయాలి. అక్కడి విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఇది బాగా తోడ్పడుతుంది.

నాయకత్వ లక్షణాలు ఉంటే మరింత ప్రయోజనం..
ప్రతీ సంస్థ మంచి విద్యార్థులను కోరుకుంటుంది. తమ విద్యా సంస్థల విద్యార్థులే మేటి పౌరులుగా ఉండాలని ఆశించడం సహజం. వారితో సమాజానికి కూడా మంచి జరగాలని కోరుకుంటాయి. కాబట్టి నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నవారికి, సమాజానికి ఉపయోగపడే పనులు చేపడుతున్న వారికి అధికంగా ప్రాధాన్యతనిస్తారు. అందుకని అప్లయ్ కు ముందే హడావుడి చేస్తే కుదరదు.. ఆయా రంగాల్లో వారు కొన్నాళ్లుగా చేపడుతున్న సేవను పరిగణలోకి తీసుకుంటాయి.

ఆ విభాగంలోని విద్యార్థుల వైపే మొగ్గు..
ప్రతీ విద్యా సంస్థ వైవిధ్యమైన విద్యార్థులను తమ సంస్థ నుంచి పంపించాలని ఆశిస్తాయి. ప్రతీ విద్యార్థి వారు ఎంచుకున్న రంగంలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాయి. కాబట్టి మీలోని టాలెంట్ సదరు విద్యాసంస్థలకు చూపిస్తే ప్రవేశానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు రాసిన ఎస్ఓపీ ప్రత్యేకంగా ఉండాలి. అందులోని మీ ఆసక్తి, ఆలోచన కనిపించాలి. ఉన్నత చదువులు, భవిష్యత్తులో మీరు ఏ రంగంలో ఎదగాలని అనుకుంటున్నారో తెలిపేలా ఉండాలి. దీన్ని ముఖ్యంగా గమనిస్తారు. కొన్ని సంస్థలు బయోడేటా, సీవీ అడగవచ్చు. అందులోని వివరాలు ఖచ్చితంగా ఉండాలి. కోర్సు ఫీజు, ఇతర ఖర్చులు భరించగలిగే స్థాయిలో ఉన్నారా? లేదా పరిశీలిస్తారు. పని అనుభవం కూడా ఉంటే ఎంతో కొంత ప్రాధాన్యం దక్కుతుంది.

సంస్థల ఎంపిక ఎలా ఉండాలంటే?
యూస్ లో దాదాపు 40 వేలకు పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో ఎది బెటర్.. మన స్కోర్ కు తగినది ఏది? అందులో ఉన్న కోర్సుల్లో ఏవి ఉత్తమమైనవి కసరత్తు చేయాలి. QS, Times తదితర సంస్థలు రిలీజ్ చేసిన ర్యాంకుల జాబితాను పరిశీలించాలి. ఏ కోర్సు బెటర్.. అది పూర్తయిన తర్వాత ఉద్యోగం చేసే కంపెనీల వివరాలను ముందుగానే తెలుసుకోవాలి. ఎవరో చెప్పారని చేరితో నష్టపోయేది మీరే. కాబట్టి ఇంటర్ నెట్ త్వారా ముందే ఎంతో కొంత సమాచారం తెలుసుకుంటే బాగుంటుంది.

నచ్చిన సంస్థలన్నింటికీ దరఖాస్తు చేసుకుంటూ పోతే డబ్బు వృథాగా మారుతుంది. మీ స్కోర్ ను అనుసరించి 10-15 సంస్థల జాబితాను సిద్ధం చేసుకోవాలి. వీటిలో మీరు చేరాలనుకునే సంస్థలు నాలుగు ఉండాలి. తక్కువ స్కోర్ ఉన్నా కూడా స్టాన్‌ ఫర్డ్‌, హార్వర్డ్‌, యేల్‌ లాంటి భారీ విద్యా సంస్థలను ఎంచుకోవడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు. జీఆర్‌ఈ స్కోర్, అకడమిక్‌ సీజీపీఏల దరిదాపుల్లోని సంస్థలను ఎంచుకోవాలి. టార్గెట్‌ సంస్థలు నాలుగు వరకు పెట్టుకుంటే వీటిలో సీటు వచ్చేందుకు 40 శాతం అవకాశం ఉంటుంది. 2 లేదంటే 3 సేఫ్టీ సంస్థలు సీటు రావడానికి 75 శాతం అవకాశం ఉన్నవి ఉండాలి.

గడువు తేదీ సమీపిస్తున్న సమయంలో హడావుడి పడకుండా నెల ముందు నుంచే దరఖాస్తు పనులు చేపడితే బాగుంటుంది. ముందుగా దరఖాస్తు చేసుకుంటే అవకావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎస్‌ఓపీ రాసేందుకు నాలుగు వారాలు కేటాయించాలి. రికమండేషన్ లెటర్లు, సపోర్టు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.

TAGS