Brahmasthra 2 shelved?:ర‌ణ్‌బీర్ `బ్ర‌హ్మాస్త్ర 2` సౌండ్ లేదేంటి?

Brahmasthra 2 shelved?:రణ్‌బీర్ కపూర్ బ్రహ్మాస్త్ర భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది అంటూ ప్ర‌చారం సాగిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అత్యంత భారీ వ‌సూళ్ల‌ను సాధించింద‌ని కూడా క‌ర‌ణ్ జోహార్ బృందం ప్ర‌చారం చేసుకుంది. అయితే ఈ సినిమా వ‌ల్ల భారీ న‌ష్టాలొచ్చాయ‌ని కంగ‌న లాంటి విరోధి ప‌బ్లిగ్గా తిట్ట‌డం తెలిసిందే. బ్ర‌హ్మాస్త్ర రణ్‌బీర్ కి ఫాలోయింగ్ ఉన్న హిందీ బెల్ట్ లో ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది.

కార‌ణం ఏదైనా కానీ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ సెట్స్ కెళుతుందా లేదా? అన్న‌ది సందిగ్ధంగా మారింది. అయాన్ ముఖ‌ర్జీ త‌న ఏడేళ్ల క‌ల‌ను నిజం చేసుకుంటూ బ్ర‌హ్మాస్త్ర తెర‌కెక్కించాడు. కానీ ఆశించిన బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్క‌లేదు. దీంతో బ్రహ్మాస్త్ర 2 వ‌ర్క‌వుట‌వుతుందా లేదా? అన్న సందిగ్ధంల ప‌డిన‌ట్టు కూడా క‌థ‌నాలొచ్చాయి. నిజానికి బ్ర‌హ్మాస్త్ర 2లో ర‌ణ్‌బీర్ తో పాటు రణవీర్ సింగ్, హృతిక్ రోషన్ స‌హా ప‌లువురు టాప్ స్టార్ల పేర్లు వినిపించాయి. వీరంతా అతిథి పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని పుకార్లు వచ్చాయి. శివ (RK పోషించిన) తండ్రిగా ..అమృత భర్తగా (దీపికా పదుకొణె నటించబోయేది) ఎవ‌రు? దేవ్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అంటూ టీజ్ చేయ‌గా ర‌ణ్‌వీర్ సింగ్ ఇందులో న‌టిస్తున్నార‌ని ప్ర‌చార‌మైంది.

ర‌ణ్‌వీర్ ఈ చిత్రానికి సంతకం చేసాడ‌ని దేవ్ పాత్రను పోషిస్తాడని కూడా భావించారు. కానీ అదంతా ఫేక్ న్యూస్ ఫ‌లితం అని కూడా తెలుస్తోంది. కొన్ని స్పష్టమైన కారణాల వల్ల ఇద్దరు స్టార్‌(ర‌ణ్‌బీర్‌-ర‌ణ్‌వీర్ )లు కలిసి పనిచేయడం లేద‌ని కూడా తెలిసింది. అయితే బ్రహ్మాస్త్ర త్రయం రెండవ భాగంలో మరొక పెద్ద స్టార్ ఉండే అవకాశం లేదు. ఏ నిర్మాత ఇద్ద‌రు పెద్ద హీరోల‌ను భరించలేడు. యానిమల్ తర్వాత రణబీర్ తన పారితోషికంపై మళ్లీ చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం అత‌డి పారితోషికం 40కోట్ల నుంచి రూ.60 కోట్లకు చేరింది. దీనికి తోడు రణ్‌వీర్ సింగ్‌ని కూడా తీసుకు వ‌స్తే బడ్జెట్‌కు పెద్ద‌ దెబ్బ అవుతుంది.

ఎందుకంటే అతడు రణబీర్ కి స‌మానంగా అడిగే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే నిర్మాత‌ ఇప్పటి వరకు రణ్‌వీర్‌తో పాటు మరే ఇతర నటుడిని సంప్రదించలేదు. ప్రధాన నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్ ఇప్పటికీ కొనసాగుతోందనే దానిపై క్లారిటీ ఉంది. తర్వాత మరో నిర్మాతను తీసుకొచ్చే అవకాశం ఉంది. అప్పుడే బ్రహ్మాస్త్ర 2 తారాగణం ఎవ‌రు? అన్న‌ది నిర్ణ‌యిస్తారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ వార్ 2 కోసం పని చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర 2 చిత్రం 2026 కంటే ముందు ప్రారంభం కాదు.. అని ప్ర‌ముఖ హిందీ పోర్ట‌ల్ క‌థ‌నం వెలువ‌రించింది.

రణ్‌వీర్ బ్రహ్మాస్త్ర 2 విష‌యంలో చాలా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న జ‌రుగుతోంది. ఎందుకంటే ఇద్దరు ప్రముఖ తారలను ఒక చిత్రంలో న‌టింపజేయ‌డానికి నిర్మాతలు ఎంత కష్టపడ్డారో తెలిసిన‌దే. అక్షయ్ కుమార్ – రోహిత్ శెట్టి వంటి ప్రముఖులు మల్టీ-స్టారర్ ప్రాజెక్ట్‌లో పనిచేయడంలో లేదా మద్దతు ఇవ్వడంలో వారు ఎదుర్కొన్న సవాళ్ల గురించి గ‌తంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇంత‌కుముందు ఇద్ద‌రు పెద్ద స్టార్ల‌తో రామ్-లఖన్‌ను ప్లాన్ చేసిన శెట్టి ఫెయిల‌వ్వ‌డం తెలిసిందే. ఇద్ద‌రు పెద్ద స్టార్లు ఒకే సినిమాలో క‌లిసి ప‌ని చేయ‌డానికి ఆస‌క్తి చూపేది కూడా త‌క్కువే.

బ్రహ్మాస్త్ర 2 సెట్స్ కెళితే దీనికోసం RRR కోసం పెట్టిన‌ 550 కోట్లు పైగా బడ్జెట్‌ను పెట్టాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తం ఇది వసూలు చేయగలదా? అంటూ ఒక డిబేట్ స్టార్ట‌యింది. రణబీర్ కపూర్ యానిమల్ తర్వాత పూర్తిగా భిన్నమైన స్థాయికి ఎదిగాడు. అతనితో ప్రాజెక్ట్‌లో ప‌ని చేసే పెద్ద స్టార్ కూడా అత‌డితో స‌మానంగా డిమాండ్ చేస్తే అది పెద్ద స‌మ‌స్య‌గా మారుతుంది. బ్రహ్మాస్త్ర 1 స్కేల్‌ని చూసి స్టార్‌ల వేతనాలతో పాటు ఏ నిర్మాత అయినా 100 కోట్లు ఎలా ఖర్చు చేస్తారు? పార్ట్ 2 VFX .. స్టైలింగ్‌పై ఎంత ఖర్చవుతుందో ఊహిస్తేనే స‌మ‌స్యాత్మ‌కంగా ఉంది.

నిజానికి బ్రహ్మాస్త్ర `పార్ట్ 1 కోసం 350 కోట్లతో మొదలు పెడితే 550 కోట్ల బ‌డ్జెట్ ఖ‌ర్చ‌యింద‌ని ప్ర‌చారం ఉంది. కానీ మేకర్స్ ఇద్దరు స్టార్స్ రణబీర్ కపూర్ – రణ్‌వీర్ సింగ్‌లను కలిసి బ్రహ్మాస్త్ర 2లోకి తీసుకురావాలంటే, ఈ మ్యాజిక్ జరగడానికి వారు ఖచ్చితంగా 600 కోట్లకు పైగా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ బ‌డ్జెట్ ని తిరిగి పొందేందుకు ఎంత పెద్ద బిజినెస్ చేయాలో ఊహించండి. ఇక లాభాల మాట దేవుడెరుగు?

అయితే నిర్మాతలు రణ్‌బీర్ కపూర్ తో ద్విపాత్రాభినయం చేయించ‌డం ద్వారా ఖర్చులను తగ్గించుకోవడం ఒక విధానం అని కూడా భావిస్తున్నారు. కానీ 600 కోట్ల ఖర్చు చేసి మరో నటుడిని తీసుకు వ‌స్తే దానితో కథ చుట్టూ పని చేయాల్సి ఉంటుంది. రెండవ విధానం కార్యరూపం దాల్చితే ఈ చిత్రం RRR బ‌డ్జెట్‌ని అధిగమించి 550 కోట్ల బడ్జెట్‌తో రూపొందాల్సి ఉంటుంది. దీంతో ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా మారుతుంది. కానీ రిట‌ర్నులు ఆర్.ఆర్.ఆర్ త‌ర‌హాలో తేవాల్సి ఉంటుంది. కానీ ఇది సాధ్య‌మేనా? అన్న త‌ర్జ‌న భ‌ర్జ‌న కూడా సాగుతున్న‌ట్టు స‌ద‌రు పోర్ట‌ల్ క‌థ‌నం పేర్కొంది.

TAGS