Allu Arjun : హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్..సంబరాల్లో అల్లు అర్జున్ అభిమానులు!
Allu Arjun : గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ప్రస్తుతం ఆరోగ్యం కుదుటపడుతోంది. హాస్పిటల్ నుంచి రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని తండ్రి చెప్పారు.దీంతో అల్లు అర్జున్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయాడు. తమ హీరో వల్ల ఇలా జరిగిన బాలుడు కోలుకోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.