YSRCP : జగన్ను దూషించిన కూటమి కార్యకర్తపై వైసీపీ శ్రేణుల దాడి
YSRCP : సమాజ మాధ్యమాల్లో మాజీ సీఎం వై.ఎస్. జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కూటమి కార్యకర్తపై వైసీపీ శ్రేణులు దాడికి దిగారు. “చంద్రబాబు” అనే పేరుతో అభ్యంతరకర పోస్టులు చేస్తూ జగన్ సహా మంత్రులను దూషించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు వ్యక్తిగత దూషణల కన్నా ఆరోగ్యకరమైన విమర్శలవైపు పార్టీలు మొగ్గుచూపాలని సూచిస్తున్నారు. ఇటువంటి ఘటనలు రాజకీయ వాతావరణాన్ని మలినం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
“చంద్రబాబు” అని పేరు పెట్టుకున్నందుకు కాదు..
మాజీ ముఖ్యమంత్రి జగన్, మాజీ మంత్రులను నీఛాతి నీచంగా బూతులు తిడుతూ సోషల్ మీడియాలో అనేక వీడియోలు పెట్టినందుకు…
ఇకనైనా ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు కూటమి పార్టీల కార్యకర్తలు దూరంగా ఉండాలి.. అంటున్న విశ్లేషకులు#RedBook… pic.twitter.com/J8ktTQTwae
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) April 29, 2025