MLA : సంచలన సర్వే: 41 మంది ఎమ్మెల్యేలకు టికెట్ రావడంలేదా?
MLA Tickets : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్న తరుణంలో, ప్రముఖ సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట వెల్లడించిన తాజా సర్వే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో 41 మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగా లేదని, వారికి టిక్కెట్ రావడం కష్టమని ఆయన అంచనా వేశారు. ఇది కూటమిలో ఆందోళనకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా కొంతమంది ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు కనిపించలేదు. ఇప్పటివరకు ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం కాకపోయినా, ముందస్తు చర్యలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సర్వే కూటమిలో మార్పులకు నాంది కాబోతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.