Pakistan : పాకిస్తాన్ కు ఓవైసీ సంచలన వార్నింగ్.. వైరల్

Pakistan : భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, కశ్మీర్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాకిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ను “ఐసిస్ వారసులు”గా అభివర్ణిస్తూ, అమాయకులను మతం పేరుతో హతమార్చే ధోరణిని తీవ్రంగా విమర్శించారు.పాకిస్తాన్ ఉప ప్రధాని హనీఫ్ అబ్బాసీ చేసిన అణుదాడి బెదిరింపులకు ఓవైసీ ఘాటుగా స్పందించారు. కేవలం 130 అణు వార్‌హెడ్‌లు చూపిస్తూ భారత్‌ను భయపెట్టలేరని, భారత్ సైనిక, ఆర్థిక శక్తి ముందు పాకిస్తాన్ ఎంత వెనుకబడిందో స్పష్టం చేశారు.అంతేకాక, సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ బెదిరింపులను నిరసిస్తూ, ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే భారత్ సహించదని హెచ్చరించారు. కశ్మీర్ భారతదేశంలో భాగమేనని, అక్కడి ప్రజల పట్ల భారత ప్రభుత్వం సముచితంగా వ్యవహరించాలని ప్రధాని మోడీకి సూచించారు.

ఓవైసీ వ్యాఖ్యలు దేశ భద్రతాపై గట్టి సంకేతంగా నిలిచాయి. వాస్తవాలను ప్రపంచానికి చాటిస్తూ, భారత్ ఐక్యతకు తన మద్దతు ప్రకటించారు.

TAGS