Sharmila : రాజ్యసభకు షర్మిల.. ఏ రాష్ట్రం నుంచి అంటే?

Sharmila : వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయంగా మరొకరికి అగ్రస్థానం దక్కింది.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభకు వెళ్తున్నారు. కర్నాటక నుంచి ఆమెకు కాంగ్రెస్ టికెట్ ఖరారైంది. గతంలో రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరుతోంది. అన్న జగన్ అండ లేకుండా రాజకీయాల్లో ముందుకు సాగిన షర్మిలకు ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఆమె ఢిల్లీకి వెళ్తుండటం వల్ల ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కూడా ఇది తోడ్పడవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

TAGS