TTD : భక్తులకు TTD కీలక సూచన
TTD : వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో భక్తులకు TTD కీలక సూచన చేసింది. చాలా మంది తమకు కేటాయించిన టైమ్ స్లాట్‌కు బదులు ముందే వచ్చి క్యూలో నిల్చుంటున్నారని మండిపడింది. రద్దీ అధికంగా ఉండటంతో ఇలా చేయడం సరికాదని, కేటాయించిన టైమ్‌కు మాత్రమే రావాలని సూచించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలోనే భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.