Anchor Rashmi : రెబల్ స్టార్ ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!

Anchor Rashmi : యాంకర్ రష్మీకి రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన చిన్న సర్ప్రైజ్ ఆమెకి పెద్ద ఎమోషనల్ మూమెంట్ అయ్యింది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోగ్రాం లో టీం మొత్తం కలిసి రష్మీ బర్త్‌డే సెలబ్రేట్ చేయగా, బులెట్ భాస్కర్ చూపించిన ఒక వీడియో ద్వారా ప్రభాస్ శుభాకాంక్షలు చెప్పినట్టుగా చూపించడంతో రష్మీ కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. అయితే అది పాత వీడియోగా, అసలు ప్రభాస్ తనకే శుభాకాంక్షలు చెప్పాడని కాదు. అయినా ఆ మూమెంట్ రష్మీకి చాలా స్పెషల్‌గా మారింది. ఇటీవలే రష్మీ సర్జరీ చేయించుకుని ఆరోగ్య పరంగా విశ్రాంతి తీసుకుంటుండగా, ఈ ప్రేమతో కూడిన సర్ప్రైజ్ ఆమె మనసును తాకింది.

TAGS