Federal grants : హార్వర్డ్ యూనివర్శిటీకి భారీ దెబ్బ – ఫెడరల్ గ్రాంట్లను నిలిపేసిన అమెరికా ప్రభుత్వం
Federal grants : అమెరికా ప్రభుత్వం, హార్వర్డ్ యూనివర్శిటీకి మంజూరైన 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండ్లను నిలిపివేసింది. ట్రంప్ పరిపాలన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం – హార్వర్డ్ యూనివర్శిటీ ప్రభుత్వ డిమాండ్లను తిరస్కరించడమే. క్యాంపస్‌లో జరిగే నిరసనలపై యూనివర్శిటీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ ప్రభుత్వం, ముఖ్యంగా క్యాంపస్ యాక్టివిజాన్ని నియంత్రించాలని చేసిన డిమాండ్‌ను హార్వర్డ్ తిరస్కరించడంతో ఈ చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో 60 మిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులు కూడా నిలిపివేయడం గమనార్హం.