Group 1 exams : తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో భారీ స్కాం

Group 1 exams : తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో దేశంలోనే అతి పెద్ద స్కాం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఒకే వరుసలో హాల్ టికెట్ నెంబర్లు ఉన్న 654 మంది అభ్యర్థులకు ఒకే మార్కులు రావడం, మరో వరుసలో హాల్ టికెట్ నెంబర్లు ఉన్న 702 మంది అభ్యర్థులకు ఒకే మార్కులు రావడం అసాధ్యమని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ నాయకులకు తెలంగాణ యువత పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు చూస్తుంటే దిగ్భ్రాంతి కలుగుతోంది. ఒకే హాల్ టికెట్ సిరీస్‌లో ఉన్న వందలాది మందికి ఒకే మార్కులు ఎలా వస్తాయి? ఇది ఖచ్చితంగా ఒక పెద్ద స్కాం. దీని వెనుక ఎవరున్నారో, ఎలా జరిగిందో తేలాలంటే సీబీఐ విచారణ జరగాల్సిందే” అని అన్నారు.

TAGS