Heroine dating : స్టార్ హీరో కుమారుడితో హీరోయిన్ డేటింగ్.. ముద్దు ఫొటోలు వైరల్

Heroine dating

Heroine dating

Heroine dating : కేరళ సుందరి అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉందంటూ సోషల్‌మీడియాలో వార్తలు జోరుగా వెలుగులోకి వస్తున్నాయి. తమిళ నటుడు, స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు పలువురు నెటిజన్లు చెబుతున్నారు. ఇటీవల వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వాటిలో ఒక ఫోటోలో ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ఉండటంతో ఇది కచ్చితంగా నిజమైన ప్రేమ కథేనని అభిమానులు భావిస్తున్నారు. వీరిద్దరూ గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు కోలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే వీరిద్దరూ ఇప్పటి వరకు ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఫ్యాన్స్ మాత్రం ఈ జోడీకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు!