Raj Bod : బీజేపీ నేతలే సుపారీ ఇచ్చారు.. రాజ్ బొడ్ తీవ్ర ఆరోపణలు
Raj Bod : బీజేపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు అమెరికాలో నివసించే ఎన్నారై రాజ్ బొడ్. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్ , రఘు నందన్ రావు లపై ఆయన చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పాస్టర్లను టార్గెట్ చేస్తూ హత్యలకు సుపారీ ఇచ్చారని రాజ్ బొడ్ పేర్కొన్నారు.
ఆయన చేసిన ఆరోపణల ప్రకారం.. గతంలో హత్యకు గురైన పాస్టర్ ప్రవీన్ పగడాల తర్వాత బీజేపీ నేతలు మరో పాస్టర్‌ను లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్‌ను రంగంలోకి దించారని వెల్లడించారు. పైగా, టార్గెట్ అయిన పాస్టర్ల పేర్లను కూడా త్వరలోనే బయటపెడతానని రాజ్ బొడ్ అన్నారు.
ఈ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది అధికారికంగా నిర్ధారణ కావాల్సిన విషయం. ఇప్పటి వరకూ ఈ ఆరోపణలపై సంబంధిత బీజేపీ నేతలు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.