Sukumar : సుకుమార్‌తో ఎన్టీఆర్.. క్యాప్షన్‌తో ఆకట్టుకున్న హీరో

Sukumar
Sukumar : యంగ్ టైగర్ ఎన్టీఆర్ , టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఒకప్పటి హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి పనిచేసిన “నాన్నకు ప్రేమతో” చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా సుకుమార్ భార్య తబిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్టీఆర్‌తో దిగిన ఒక క్యూట్ ఫోటోను షేర్ చేస్తూ “తారక్‌కు ప్రేమతో” అని క్యాప్షన్ ఇచ్చారు. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ “నన్ను ఎప్పుడూ వెంటాడే ఓ ఎమోషన్” అంటూ సుకుమార్‌ను ట్యాగ్ చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనం. “నాన్నకు ప్రేమతో” సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగును క్యాప్షన్‌గా పెట్టడం విశేషం.