Mithun Reddy : మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం
Mithun Reddy : వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ జరుపుతున్న సీఐడీ, ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కుంభకోణంలో రూ. 4 వేల కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మిథున్ రెడ్డితో పాటు మరో ఎంపీ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆయనకు తాత్కాలిక ఊరటనిచ్చింది.