CM Revanth Reddy:కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్
CM Revanth Reddy:మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం అర్థ్రరాత్రి ప్రమాదానికి గురి కాడం తెలిసిందే. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోని బాత్రూమ్లో కేసీఆర్ కాలుజారి పడ్డారు. దీంతో ఆయనని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్, సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ఎడమ తుంటి ఎముక విరిగిందని, దానికి సంబంధించిన సర్జరీ చేయాలని డాక్టర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
`మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను` అని ట్వీట్ చేశారు. అంతకు ముందే యశోద ఆసుపత్రి వద్ద భద్రతను పెంచమని అధికారులకు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్లో కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించడం విశేషం.
రీసెంట్గా కేసీఆర్ హెల్త్ బులెటిన్ ని విడుదల చేసిన డాక్టర్లు ఆయన ఆరోగ్యం నిలకడగ ఉందని, కేసీఆర్‌కు శస్త్ర చికిత్స అవసరమని స్పష్టం చేశారు. ఎడమ తుంటి మార్పిడి చేయాలని వెల్లడించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కేసీఆర్‌కు సర్జరీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సర్జరీ అనంతరం ఆయనకు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది.
ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది.
కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని…
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023