Flight cancellations : విమానం రద్దు అయితే ప్రయాణికులకు ఇక ఆటోమేటిక్ రీఫండ్స్

Flight cancellations : విమాన ప్రయాణాలు సడెన్ గా రద్దు అయితే ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు.. లాంజ్ లో గంటల తరబడి వెయిట్ చేయడమో.. లేక వేరే విమానం పట్టుకొని వెళ్లడమే తప్పదు. ఆ ఎదురుచూపులు.. నష్టం పూడ్చలేనిది. అయితే తాజాగా విమానయాన రంగంలో ఓ కీలకమైన నిర్ణయం వెలువడింది. ఈ వారం అమల్లోకి వచ్చిన కొత్త రవాణా శాఖ నియమం ప్రకారం.. విమానాలు రద్దు అయితే ఆ ఎయిర్‌లైన్స్ లు కస్టమర్‌లకు ఆటోమేటిక్ రీఫండ్‌లను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

కొత్త నిబంధన వల్ల విమానాల ఆలస్యం అయినా.. రద్దు అయినా కూడా ఆ నరకయాతన పడ్డ ప్రయాణికులకు వాగ్దానం చేసినట్లుగా ఎయిర్‌లైన్ సంస్థలు ఎలాంటి పత్రాలను ఫైల్ చేయకుండానే మీ డబ్బును తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతరాయాలను తగ్గించడానికి విమానయాన సంస్థలను ప్రోత్సహించడానికి కూడా ఈ చట్టం రూపొందించబడింది. ఈ నియమం అమలులోకి తెస్తున్నట్టు రవాణా శాఖ కార్యదర్శి పీట్ బుట్టిగీగ్ బుధవారం చెప్పారు.

“రద్దు చేసిన విమానంలో ఉన్న ప్రయాణీకులకు వారి డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. ఎయిర్‌లైన్‌ సంస్థలు తిరిగి చెల్లించాలి. ఇలా చేయడం వల్ల విమానాలు రద్దు అయ్యే అవకాశం తక్కువ” అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం ఫ్లైట్ రద్దులు ఇప్పటికే సాంప్రదాయ సగటు 2% కంటే తక్కువగా ఉన్నాయి.

TAGS