parcels scam : పార్శిల్ పేరిట కొత్త స్కాం.. స్కాన్ చేశారా మీ పని గోవిందా?
parcels scam : ఏదో పార్శిల్ వచ్చినట్టు ఇంటి ముందు ఉంటుంది. అయితే అదేంటన్నది రాదు.. ఫలానా చోట ఉంది మీరు తెచ్చుకోవాలి అని ఉంటుంది. అందులో డేట్, ఫోన్ నంబర్ ఇతర వివరాలు ఉంటాయి. వెంటనే దీన్ని స్కాన్ చేయండి మీకు పార్శిల్ వస్తుందని ఉంటుంది. అయితే పొరపాటు పడి స్కాన్ చేశారో మీ సంగతి అంతే ఇక..
ఇదొక కొత్త స్కాం.. ఒక లెటర్ పేరిట ఇంటికి పంపిస్తారు. అందులో స్కానర్ పెడుతారు. ఒకసారి స్కాన్ చేశారో మీ అకౌంట్లోని డబ్బులన్నింటిని కాజేస్తారు.
అందుకే ఈ కొత్త స్కాం నుంచి ప్రజలందరూ అలెర్ట్ గా ఉండాలని దేన్ని పడితే దాన్ని స్కాన్ చేయవద్దని సూచిస్తున్నారు. ఆర్డర్ బుక్ చేయకపోతే అసలు ఏమీ తీసుకోవద్దని.. ఈ మోసాన్ని గ్రహించాలని సూచిస్తున్నారు.