Pushpa 2 : పుష్ప 2లో 40% దర్శకత్వం సుకుమార్ వహించలేదట?
Pushpa 2 : దర్శకుడు సుకుమార్ , అతని టీం గత రాత్రి పుష్ప 2 సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో దర్శకుడు సుదీర్ఘంగా మాట్లాడారు. తన సహాయ దర్శకులను పరిచయం చేస్తున్నప్పుడు సంచలన విషయం బయటపెట్టారు. సుకుమార్ తన సహాయ దర్శకుడు శ్రీమాన్ గురించి ఓ సంచలన విషయం బయటపెట్టాడు. శ్రీమాన్ దాదాపు సగం చిత్రానికి దర్శకత్వం వహించాడని ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. సుకుమార్ ఈ సందర్భంగా శ్రీమన్ ప్రతిభను బయటపెట్టాడు. అతని పట్ల తనకున్న ప్రగాఢ అభిమానాన్ని చాటుకున్నాడు.
చిన్ననాటి సన్నివేశాలు, ట్రక్ సీక్వెన్సులు , రెండవ యూనిట్ షాట్‌లతో సహా పుష్ప 2: ది రూల్‌లో 30 నుండి 40 శాతం శ్రీమన్ దర్శకత్వం వహించాడని సుకుమార్ వెల్లడించారు. నిజానికి టైటిల్ కార్డులో దర్శకత్వం పేర్లలో “శ్రీమాన్, సుకుమార్ ” అని టైటిల్ కార్డ్ వేయాలి అని కూడా సుకుమార్ అనడం విశేషం. ఈ ప్రశంసలతో సుకుమార్ తన అసిస్టెంట్ డైరెక్టర్ కు బహిరంగంగా క్రెడిట్ ఇచ్చి తన మంచి మనుసును చాటుకున్నాడు. మరి శ్రీమాన్ ఇంకో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అడుగుజాడల్లో నడుస్తాడా.. సుకుమార్ క్యాంపు నుండి తదుపరి దర్శకుడిగా మారతాడా? కాలమే సమాధానం చెప్పాలి.