Srileela : ఈ ఏడాది ఎందుకు నటించలేదో కారణం చెప్పిన శ్రీలీల
Srileela : శ్రీలీల..యంగ్ సెన్షేషన్.. టాలీవుడ్ లో దూసుకొచ్చిన హీరోయిన్. అయితే ఈ ఏడాది సినిమాలు బాగా తగ్గించేసింది. లాస్ట్ ఇయర్ వరుస సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది మాత్రం బన్నీతో కలిసి పుష్ప2లో ఐటెం సాంగ్ చేసింది. సినిమాల్లో తక్కువగా నటిస్తోంది. దీనికి కారణం ఏంటని ఓ రిపోర్టర్ అడగగా.. గత సంవత్సరం వరుస సినిమాలతో తన ఎంబీబీఎస్ హాజర్ బాగా తగ్గిపోయిందని.. అందుకే ఈ ఏడాది సినిమాలు తగ్గించి ఎంబీబీఎస్ చదువు పూర్తి చేయాలనుకుంటున్నట్టు శ్రీలీల పేర్కొంది.
చదువు కోసమే సినిమాలు ఆపేశానని సంచలన ప్రకటన చేశారు. అంటే తనకు మూవీస్ కంటే చదువే ఇష్టమని.. డాక్టర్ కావడమే తన ప్రథమ ప్రియారిటీ అని చెప్పుకొచ్చింది. కాగా పుష్ప2లో ఐటెం సాంగ్ కోసం శ్రీలీల 2 కోట్లు తీసుకుందని.. సినిమా కంటే కూడా ఈ డబ్బుతోనే తను కోట్లు సంపాదిస్తోందని అంటున్నారు.
View this post on Instagram