Destroy AP : అయ్య బాటలో కొడుకు.. ఇద్దరూ ఏపీని నాశనం చేయాలనుకున్నారా..?

Destroy AP : వారిద్దరూ తండ్రీ కొడుకులు.. ఒకరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణను కలుపుకొని)కు ముఖ్యమంత్రిగా పని చేస్తే మరొకరు ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత)కు సీఎంగా పని చేశారు. ఇద్దరిదీ ఒకే రక్తం. తండ్రీ కొడులు కాబట్టి ఒకే రక్తం అనే ఉద్దేశ్యం కాదండీ..! అవినీతిలో ఇద్దరిదీ ఒకే బ్లడ్ అన్నట్లు. గతంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రపంచాన్ని ఏలాలన్న కాంక్షతో అందిన కాడికి లంచాలు తీసుకుంటే.. నేడు కొడుకు  జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన బాటలోనే భారీగా లంచాల రూపంలో డబ్బులు మింగి ఎంజాయ్ చేస్తున్నాడు.

నాడు తండ్రి వైఎస్ఆర్ ఉత్తరాంధ్రలోని బాక్సైట్ నిల్వలను అమెరికాలో ఇంటర్నేషనల్ మాఫియా డాన్ దిమిత్రీ ఫిర్టాస్ కు అప్పగించారు. ఊరికే కాదు.. పైగా రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం కలిగేది కూడా కాదు. ఫిర్టాస్ ఇచ్చిన భారీ ఆఫర్ కు ట్మెంట్ అయ్యి ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అమెరికా ఎఫ్‌బీఐ బయటపెట్టి అప్పుడు  వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేసింది. ఉక్రెయిన్ కు చెందిన ఫిర్టాస్ ను ఆస్ట్రియా అరెస్ట్ చేస్తే.. మాకు అప్పగించండి అని అమెరికా కోరింది.

అది కాస్త పక్కన రాష్ట్రానికి లాభాలు ఇచ్చే గంగవరం పోర్టు వాటాను కారు చౌకగా అదానీకి కట్టబెట్టాడు అప్పటి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి. అక్కడితో ఆగలేదు.. విద్యుత్ పీపీఏలు రద్దుచేసి భూములు కట్టబెట్టి, అధిక ధరకు బొగ్గు, విద్యుత్ కొని జనానికి మసిబూశాడు జగన్. ఈ ఒప్పందంలో 1750 కోట్లు వెనకేసుకున్నాడని కేసు జగన్ పై నమోదు చేసింది.

ప్రపంచ కుభేరుడైన ఆదానీ తన షేర్ల పతనంతో ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాడు. వరల్డ్ ఎలైట్ లిస్టులో ఉన్న వారి యుద్ధం ఎలా ఉన్నా.. లంచాలు తిన్న జగన్ రాష్ట్ర, దేశ పరువును మంటగలపడమే కాకుండా.. దేశ స్టాక్ మార్కెట్ పతనానికి కారకుడయ్యాడు. ఇలాంటి డబ్బు జబ్బు ఉన్న వ్యక్తి ఉండకూడదు అని కోరుకోవడం తప్ప ఏమీ చేసేది లేదు. తన జేబులోకి పైసా రావాలంటే రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఏమైనా పట్టించుకోడని చెప్పకనే చెప్పవచ్చు. అధికారం కోసం తాళిబొట్లను తెంచడానికి కూడా వెనుకాడని కిరాతకులు. వారిని నమ్మితే ఆదానీ ఏంటి మస్క్ లాంటి మహారాజు కూడా భిక్షగాడు కాకతప్పదన్న

TAGS