Extramarital affair : వివాహేతర సంబంధం.. భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ డీఈవో
Extramarital affair : నల్లగొండ డీఈవో భిక్షపతి భార్య ఉండగానే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. భిక్షపతి ప్రవర్తనపై నిఘా వేసిన భార్య అతను మరో మహిళతో ఉండగా కుటుంబ సభ్యులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భిక్షపతిని నిలదీయగా ఆమెను ఇంటి నుంచి బయటకు పొమ్మ టూ బెదిరించాడు. తనను పెళ్లి చేసుకుని వదిలేసి, 14 ఏండ్లుగా తన పలుకుబడితో కోర్టులో విడాకుల కేసు నడిపిస్తూ, మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. గతంలో మరో మహిళతోనూ ఇలాగే వ్యవహరించాడని, ఇప్పుడు ఇంకో మహిళను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాడని భిక్షపతి భార్య తెలిపింది.