KTR : 29న రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్: కేటీఆర్

KTR

KTR

KTR : ఈ నెల 29వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా దీక్ష దీవస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివస్ నిలుస్తోందని తెలిపారు. 2009, నవంబరు 29న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు.

TAGS