Visakhapatnam Steel : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: ఏపీ మంత్రులు

Visakhapatnam Steel

Visakhapatnam Steel

Visakhapatnam Steel : విశాఖ స్టీల్ ప్లాంట్ పై శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యలు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులు శాసన మండలిలో ఆరోపించారు. దీనిపై స్పందిస్తూ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ తేల్చిచెప్పారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి సైతం ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టం చేశారని భరత్ గుర్తు చేశారు.

ప్రైవేటీకరణ వద్దని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కోరినట్లు పవన్ వివరించారు. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరిస్తామంటే తామే ఆపామని ఆయన గుర్తు చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ప్రైవేటీకరణపై ముందడుగు పడిందని అధికార పార్టీ సభ్యులు ధ్వజమెత్తారు. దీనిపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ప్రైవేటీకరణ వద్దంటూ సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. ఆ తర్వాత మాట్లాడిన అచ్చెన్న, ప్రైవేటీకరణ అంశమే ఉత్పన్నం కానప్పుడు తీర్మానం ఎందుకని ప్రశ్నించారు.

TAGS