Accident : ఫార్మా కంపెనీలో ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Accident

Accident

Accident : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సూరారంలోని అరోరా ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి కార్మికుడు అనిల్ (43) మృతి చెందారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని అరోరా ఫార్మా కంపెనీ రియాక్టర్ లో రసాయన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్మికుడు అనిల్ మృతి చెందగా ముగ్గురు కార్మికులు గోపి (23), శ్రీనివాస్ (25), బలరాం (30)నకు తీవ్ర గాయాలయ్యాయి. బాయిలర్ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం ఉదయం జరిగితే, మృతుడి, బాధితుల కుటుంబాలకు సంస్థ నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదు. సంస్థ ముందు మృతుడి బంధువులు నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు.

TAGS