Gachibowli : గచ్చిబౌలిలో ఒరిగిన భవనం.. కూల్చివేస్తున్న అధికారులు
Gachibowli : హైదరాబాద్ లోని గచ్చిబౌలి సిద్ధిక్ నగర్ లో ఒరిగిపోయిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలకు ఎటువంటి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హైడ్రా బాహుబలి జాక్ క్రషర్ తో అధికారులు భవనాన్ని కూల్చివేస్తున్నారు.
భవనం పక్కనే పెద్ద పెద్ద గుంతలు తీయడంతో గత రాత్రి ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పూర్తిగా డ్యామేజ్ అయినట్లు ఇంజనీరింగ్ నిపుణులు గుర్తించారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు రిపోర్టు ఇచ్చారు. ఈ నేపథ్యంలో భవనాన్ని కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించి కూల్చివేతల ప్రక్రియను మొదలుపెట్టారు. గతంలో బహదూర్ పురా, జీడిమెట్లలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఐదు అంతస్థుల భవనం పక్కకు ఒరగడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.